ఇటీవల రిలీజ్ చేసిన `దోస్తీ` సాంగ్ తో #RRR ప్రమోషన్స్ పీక్స్ కి చేరుకున్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేయడమే ధ్యేయంగా జక్కన్న తనవంతు ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక ప్రమోషన్స్ పరంగా తగ్గేదేలే! అన్నంతగా ప్లానింగ్ ని ఛేంజ్ చేశారు. ఇకపై రెగ్యులర్ గా స్టార్లు ఫ్యాన్స్ కి టచ్ లో ఉండేలా ప్లానింగ్ ని డిజైన్ చేశారని అర్థమవుతోంది.
తాజాగా భీమ్ తో మాట్లాడే అవకాశం కల్పిస్తూ ఆర్.ఆర్.ఆర్ ఇన్ స్టాలో స్పెషల్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. #RRR మూవీ ఇన్ స్టాగ్రమ్ ని మన భీమ్ జూనియర్ ఎన్టీఆర్ కి టేకోవర్ చేస్తున్నాం. రేపటి (9 ఆగస్టు) నుంచి రాబోవు కొద్దిరోజుల పాటు అభిమానులకు తారక్ టచ్ లో ఉంటారు అని ప్రకటిస్తూ తాజాగా తారక్ కొత్త లుక్ ని రిలీజ్ చేసారు. ఉక్రెయిన్ లో తారక్ ఏం చేస్తున్నాడో చూడండి అంటూ టీజ్ చేసారు మరి. ఆసక్తికరంగా #RRR టైటిల్ ని ముద్రించిన వైట్ టీషర్ట్ ధరించి తారక్ స్మైలీ లుక్ తో అదరగొట్టాడు. ఇకపై జక్కన్న తనదైన మార్క్ ప్రమోషన్స్ కి తెర తీసారని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మునుముందు రామ్ చరణ్.. ఆలియా భట్.. అజయ్ దేవగన్ అందరూ ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీ అవుతారనే భావించవచ్చు.
RRR టీమ్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఉంది. రష్యా- ఉక్రెయిన్- రొమానియా- బ్లాక్ సీ ఏరియాల్లో రామ్ చరణ్- అలియా భట్ పై ఓ పాట చిత్రీకరించారు. అలాగే హైదరాబాద్ లో చిత్రీకరణ పూర్తయితే తదుపరి పూర్తి స్థాయి నిర్మాణానంతర పనుల్లోకి దిగిపోనున్నారు జక్కన్న. ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ అవైటెడ్ ఆర్.ఆర్.ఆర్ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. అక్టోబర్ లో ఈ సినిమా చెప్పిన షెడ్యూల్ కే రిలీజవుతుందని టీమ్ నమ్మకంగా ఉంది.