RRR టీమ్ .. క‌రోనా సెల‌వుల్లో ఎంత ప‌ని చేశారు!

Update: 2020-03-22 03:52 GMT
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి సార‌థ్యంలో ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్న సంగ‌తి తెలిసిందే. 2021 సంక్రాంతికే రిలీజ్ అని ప్ర‌క‌టించినా షూటింగ్ ప‌రంగా ఎలాంటి అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌కుండా టీమ్ ని ప‌రుగులు పెట్టిస్తున్నారు. అందుకే చ‌రణ్ - తార‌క్ కి హ‌డావుడి త‌ప్ప‌డం లేదు. అయితే ఊహించ‌ని మ‌హమ్మారీ క‌రోనా ఈ స్పీప్ కి బ్రేకులు వేసింది. క‌రోనా క‌ల్లోలం నేప‌థ్యం లో అన్ని సినిమాల షూటింగులు ఆపేయాల్సిందిగా ఫిలింఛాంబ‌ర్ పిలుపునిచ్చిన నేప‌థ్యంలో ఆర్.ఆర్.ఆర్ టీమ్ కూడా స్పందించింది. షూటింగుకి సెల‌వులు ఇచ్చేసిన రాజ‌మౌళి బృందం ప్ర‌స్తుతం ఏం చేస్తున్నారు? అంటే.. ఇప్ప‌టికే క‌రోనాని నిలువ‌రించాలంటూ సందేశం ఇచ్చిన టీమ్ ఈ ఖాళీ స‌మ‌యాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్లాన్ చేసింది.

ఈ గ్యాప్ లోనే జ‌క్క‌న్న త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన స్పోర్ట్స్ పై దృష్టి సారించారు. రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ బ‌హుమ‌తుల కార్య‌క్రమంలో పాల్గొన్న రాజమౌళి- ఎన్టీఆర్- రామ్ చరణ్... ఛాంపియన్ గా నిలిచిన నల్గొండ జట్టుకు షీల్డ్స్ అందించారు. ఈ సంద‌ర్భంగా టీమ్ తో క‌లిసి దిగిన ఫోటో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.  క్రీడాకారుల్లో స్థ్వైర్యం నింపే ప్ర‌య‌త్న‌మే ఇది అయినా .. మాస్క్ లు లేకుండా ఇలా స‌మూహంగా ఫోటో దిగుతారా? అన్న కామెంట్లు వినిపించాయి. క‌రోనా జాగ్ర‌త్త‌లు చెప్పి ఇలా చేయ‌కూడ‌ద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

తిరిగి ఆర్.ఆర్.ఆర్ టీమ్ షూటింగుకి వెళ్లేదెపుడు? అంటే ప్ర‌స్తుత స‌న్నివేశం చూస్తుంటే ఏప్రిల్ లోనూ ఇలానే ఉంటే షూటింగుకి వెళ్ల‌డం క‌ష్ట‌మే. క‌రోనాని పూర్తిగా త‌రిమేశాం అంటూ వుహాన్ (చైనా)  వైద్యుల్లా ధైర్యంగా మ‌న వాళ్లు చెప్ప‌గ‌లిగే వ‌ర‌కూ క‌ష్ట‌మే. చైనాను మించిన ముప్పు భార‌త్ కి ఉంద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. క‌రోనా పాజిటివ్ అని తేలినా బాధ్య‌తా రాహిత్యంగా జ‌న‌స‌మూహాల్లో తిరిగేస్తున్న దౌర్భాగ్యులు మ‌న‌లో ఎక్కువ‌. ప్ర‌భుత్వాలు ఎన్ని జాగ్ర‌త్త‌లు చెబుతున్నా పెడ‌చెవిన పెట్టే మూక‌లే ఎక్కువ‌య్యాయి. అందువ‌ల్ల ఈ పెను ముప్పు ఎప్ప‌టికి తొల‌గిపోతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఈనెల 31 వ‌ర‌కూ అన్ని షూటింగులు బంద్. అంటే ఏప్రిల్ 1 నుంచి తిరిగి ప్రారంభించాల్సి ఉంటుంది. 15 రోజుల గ్యాప్ త‌ర్వాత కూడా వేచి చూస్తారా? మ‌రి రాజ‌మౌళి టీమ్ ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News