#RRR కొత్త లోగో: రామ్ - భీమ్ క‌ల‌యిక‌తో చండ్ర‌నిప్పులే!

Update: 2020-10-11 05:15 GMT
రౌద్రం రణం రుధిరం ... (RRR) టైటిల్ కి త‌గ్గ‌ట్టే పాన్ ఇండియా కేట‌గిరీలో మ‌రో భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీని తెర‌కెక్కిస్తున్నారు రాజ‌మౌళి. ఐదారు నెల‌ల గ్యాప్ త‌ర్వాత అన్ లాక్ ప్ర‌క్రియ‌లో ఈ మూవీ పెండింగ్ షూటింగ్ ని వేగంగా ముగించేందుకు జ‌క్క‌న్న షూట్ స్టార్ట్ చేశారు. ఆన్ లొకేష‌న్ నుంచి ర‌క‌ర‌కాల లీకులు వేడి పెంచేస్తున్నాయ్. స‌మ్మ‌ర్ 2021 రిలీజ్ ల‌క్ష్యంగా రాజ‌మౌళి ప్ర‌తిదీ స్పీడ్ పెంచారు.

ఎన్.టి.ఆర్ - రామ్ చరణ్ ల‌పై కీల‌క స‌న్నివేశాల్ని డిసెంబ‌ర్ లోపు పూర్తి చేసేందుకు రాజ‌మౌళి ప్లాన్ చేశారు. 10 అక్టోబ‌ర్ రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ కొత్త లోగోను విడుదల చేశారు. లోగోలో రెండు చేతులు ఒకదానితో ఒకటి కలిసి యునైటీని ఆవిష్క‌రించాయి. ఎన్టీఆర్ - రామ్ చరణ్ (రామ్ - భీమ్) అల‌యెన్స్ తో ఇక నిప్పులే అని దీన‌ర్థం. లోగో మూవీ కథాంశానికి ప్రతీకగా నిలిచింది. ఇందులో కొమరం భీమ్ పాత్రలో ఎన్.టి.ఆర్ ..అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ బ్రిటిష్ వారితో పోరాడటానికి చేతులు కలిపారని అర్థ‌మ‌వుతోంది.

స్వాతంత్రానికి పూర్వం జ‌రిగిన క‌థాంశానికి ఫిక్ష‌న్ ని జోడించి ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నామ‌ని రాజ‌మౌళి- విజ‌యేంద్ర ప్ర‌సాద్ జోడి ఇంత‌కుముందు తెలిపారు. దాదాపు రూ .400 కోట్ల బడ్జెట్ తో డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ దేశభక్తి మూవీలో అజయ్ దేవ్ ‌గన్ - అలియా భట్- ఒలివియా మోరిస్- సముదిర‌ఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Tags:    

Similar News