RRR ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

Update: 2022-05-12 06:38 GMT
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్'' (రౌద్రం రణం రుధిరం). యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ.. మార్చి 25న గ్రాండ్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది.

RRR సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1130 కోట్లకు పైగా వసూళ్ళతో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో వరల్డ్ వైడ్ అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన నాలుగో భారతీయ చిత్రంగా.. 2022లో రెండో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటికీ పలు థియేటర్లలో రన్ అవుతోన్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.

ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని మే 20న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. భారీ రేటుకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ జీ5 లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. హిందీ మినహా తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

నిజానికి RRR చిత్రాన్ని జీ ప్లెక్స్ లో పే పర్ వ్యూ విధానంలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు జీ5 ఓటీటీలో సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారికి నార్మల్ గానే చూసే అవకాశం కల్పిస్తోంది. థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి వండర్స్ నమోదు చేస్తుందో చూడాలి.

కాగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో RRR చిత్రాన్ని నిర్మించారు. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించిన కల్పిత కథతో ఈ సినిమా రూపొందింది. ఇందులో భీమ్ గా తారక్.. రామరాజుగా చరణ్ ల నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.

ఇందులో ఆలియా భట్‌ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్‌ దేవగణ్‌ - శ్రియ - సముద్రఖని - రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
Tags:    

Similar News