మరో 30 దేశాల్లో 'ఆర్ఆర్‌ఆర్‌' సందడికి రెడీ

Update: 2022-04-14 10:30 GMT
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదల అయ్యి భారీ వసూళ్లను రాబట్టింది. మొదటి రెండు వారాల్లోనే వెయ్యి కోట్ల వసూళ్లను దక్కించుకున్న ఈ సినిమా ఇంకా దేశ వ్యాప్తంగా పలు సెంటర్స్ లో ఆడుతూనే ఉంది. మరో వారం రెండు వారాల వరకు దేశంలో ఈ సినిమా హడావిడి కనిపించే అవకాశం ఉంది. అయితే ఆ తర్వాత కూడా ఈ సినిమా సందడి ఉంటుందని సమాచారం అందుతోంది.

ఆ తర్వాత ఈ సినిమా సందడి మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో ఉండబోతుందట. తాజాగా రామ్‌ చరణ్ ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాను త్వరలో 30 దేశాల్లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ఈ స్థాయిలో వసూళ్లను దక్కించుకున్న సినిమాను మరో ముప్పై దేశాల్లో విడుదల చేయడం అంటే ఖచ్చితంగా బాహుబలి 2 రికార్డు బ్రేక్‌ అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారంటూ టాక్‌ వినిపిస్తుంది.

దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున వసూళ్లు దక్కించుకున్న ఈ సినిమా ను ఇతర దేశాల్లో ఆయా భాషల్లో విడుదల చేయడం వల్ల ఖచ్చితంగా భారీగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. జపాన్ తో పాటు పలు దేశాలకు సంబంధించిన ప్రేక్షకులు జక్కన్న సినిమా ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కనుక ఈ సినిమా అక్కడ విడుదల చేయడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

బాహుబలి 2 సినిమా చైనాలో విడుదల అయ్యి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. కాని ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదల చేస్తే ఖచ్చితంగా అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ను చైనా తో పాటు ఇంకా పలు దేశాల్లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది చివరి వరకు ఈ సినిమా ను ఏదో ఒక  దేశంలో ఆడిస్తూనే ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ లు హీరోలుగా ఆలియా భట్ హీరోయిన్ గా అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా కు కీరవాణి సంగీతాన్ని అందించాడు. అద్బుతమైన సినిమా గా విజువల్‌ వండర్‌ గా ఉందంటూ రివ్యూలు వచ్చాయి.

దాంతో వెయ్యి కోట్లు చాలా ఈజీగానే రాబట్టింది. మరో అయిదు వందల కోట్ల వసూళ్లను ఈ సినిమా రాబట్టాలనే పట్టుదలతో మేకర్స్ ఉన్నారు. మరి అది ఎంత వరకు సాధ్యం అనేది చూడాలి.
Tags:    

Similar News