అందుకోసం రాజమౌళి ప్లాన్ వేస్తాడా.. మ్యాజిక్ చేస్తాడా..?

Update: 2020-05-13 03:45 GMT
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్, ఎన్టీఆర్ జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా లాక్ డౌన్‌ లోకి వెళ్లింది. అందుకే షూటింగు నిలిచిపోయింది. షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఎవరికీ తెలీదు.

ఇంతలో వచ్చే సంవత్సరం జనవరి 8న ఆర్ఆర్ఆర్ ను విడుదల చేస్తామని రాజమౌళి టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం.. సినిమా షూటింగ్ 70% పూర్తయిందని.. మిగిలిన 30% షూటింగ్ జూన్ లేదా జూలై నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఇక షూటింగ్ ప్రారంభం అయితే.. ఆర్ఆర్ఆర్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు.. ప్రచారాలకు తగిన టైమ్ లభిస్తుందని తెలిపాడు రాజమౌళి. కానీ ఇప్పుడే అసలు సమస్య వచ్చి పడింది. సినిమా షూటింగ్ చేయాలంటే మినిమం టెక్నికల్ టీమ్, యాక్టింగ్ టీమ్ ఉండాలి. గవర్నమెంట్ రూల్ ప్రకారం.. 20మంది లోపు మందితో షూటింగ్ నడిపించవచ్చు.

కానీ ఆర్ఆర్ఆర్ ఏమో మాములు సినిమా కాదు. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. అంటే ఈ షూటింగ్ లో హీరోలతో పాటు బ్రిటిషర్లుగా నటిస్తున్న ఫారెన్ టీమ్, ఫారెన్ ఫైటర్స్, ఇతర రాష్ట్రాలలోని యాక్టర్స్ టెక్నీషియన్లు.. ఇలా అందరినీ పోగుచేసి షూటింగ్ జరపాలి. అంటే రాజమౌళికి ఇది పెద్ద సవాల్ అనే చెప్పాలి. అసలు టీమ్ అంతా ఎలా సెట్ చేస్తాడు.. ఈ లాక్ డౌన్ ఏమో ఇప్పట్లో ముగిసేలా లేదు. చూడాలి మరి ఏదైనా ప్రత్యేక ప్లాన్ వేస్తున్నాడేమో.. ఎందుకంటే రోజులు గడిచిన కొద్ది రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. ఏమైనా మ్యాజిక్ చేస్తాడా.. వెయిట్ అండ్ సి అన్నట్లే ఉంది పరిస్థితి.
Tags:    

Similar News