టాప్ స్టోరి: RRR స్టార్లు లాక్ డౌన్

Update: 2020-04-04 04:00 GMT
క‌రోనా హాలిడేస్ ని ఒక్కొక్క‌రూ ఒక్కోలా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. ప‌లువురు ద‌ర్శ‌కులు హాయిగా ప్ర‌స్తుత సినిమా టెన్ష‌న్ ని ప‌క్క‌న పెట్టి.. త‌దుప‌రి సినిమాల‌కు లైన్ క్లియ‌ర్ చేసుకుంటున్నారు. ఆ కోవ‌లోనే కొర‌టాల కూడా ప్లాన్ చేస్తున్నారా?  ఆచార్య త‌ర్వాత ఏంటి? అన్న‌ దానిపై అత‌డికి లాక్ డౌన్ స‌మ‌యంలోనే క్లారిటీ వ‌చ్చేసిందా? అంటే అవున‌నే స‌మాచారం.

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతోన్న‌ 152వ  చిత్రం ఆచార్య కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ ద‌శ‌లో  ఉంది. 92 రోజుల్లో చిత్రీక‌ర‌ణ పూర్తిచేసి... అటుపై పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తిచేసి రిలీజ్ చేయాల‌న్న‌ది యూనిట్ ప్లాన్. అయితే ఊహించ‌ని విపత్తు షూటింగుని లాక్ డౌన్ చేసేసింది. క‌రోనా మ‌హ‌మ్మారీ లాక్ డౌన్ కార‌ణంగా షూటింగ్ వాయిదా ప‌డింది. ఇప్ప‌టికే 2021 సంక్రాంతికి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ త‌ర్వాత చిరు 152 విడుద‌ల ఉంటుంద‌ని ప్రచారం సాగుతోంది. ఆర్.ఆర్.ఆర్ జ‌న‌వ‌రిలో రిలీజ్ అయితే... ఆ త‌ర్వాత వ‌చ్చే తేదీల్లో ఆచార్య రిలీజ్ కావాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి పైగా స‌మ‌యం ప‌డుతుంద‌న్న‌మాట‌.

తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో రిలీజ్ మ‌రింత ఆల‌స్యమ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. అటు ఆర్.ఆర్.ఆర్ కూడా డిలే అయ్యే అవ‌శాలున్నాయి. అయితే ఈలోగానే ఆర్.ఆర్.ఆర్ స్టార్లు కొర‌టాలకు స‌రెండ‌ర్ అవుతున్నార‌ని తెలుస్తోంది. అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడిపై స‌ద‌రు హీరోలు అప్పుడే క‌ర్చీప్ వేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ప్ర‌చారం మొద‌లైంది. ఇప్ప‌టికే ఆర్.ఆర్.ఆర్  త‌ర్వాత మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కొర‌టాల‌తో సినిమా చేయ‌నున్నాడ‌ని మీడియాలో జోరుగా క‌థ‌నాలొచ్చాయి. అస‌లే ఆ కాంబినేష‌న్ లో గ‌తంలో ఓ సినిమా ప్రారంభ‌మై ఆగిపోయింది. ఈ నేప‌థ్యంలో ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ జోడీ వీలైనంత త్వ‌ర‌గా సినిమా చేయ‌నున్నార‌ని ప్ర‌చారం పీక్స్ లో జ‌రుగుతోంది. అటు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అయిన వెంట‌నే సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడుట‌.

ప్ర‌స్తుతం ఉన్న ద‌ర్శ‌కుల్లో కొర‌టాల ఒక్క‌డే సేఫ్ జోన్ ద‌ర్శ‌కుడిగా క‌నిపిస్తున్నాడ‌ని తార‌క్ భావిస్తున్నాడుట‌. అయితే ఇప్ప‌టికే తార‌క్...త్రివిక్ర‌మ్ తో మ‌రో సినిమా చేస్తాడ‌ని ప్ర‌చారం సాగుతోన్న వేళ కొర‌టాల పేరు తెర‌పైకి రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి ఆ ఇద్ద‌రిలో ఎవ‌రు ముందుగా తార‌క్ తో సినిమా చేస్తారు? ఏ స్టార్ ఏ డైరెక్టర్ తో తార‌క్ ముందుకెళ‌తాడు అన్న‌ది ఇప్పుడ‌ప్పుడే  అయితే క్లారిటీ వ‌చ్చేట్టు లేద‌ట‌. అందుకోసం కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందేన‌ని కొత్త విష‌యం బ‌య‌టికొచ్చింది.


Tags:    

Similar News