జూలైలో RRR స‌స్పెన్స్ కి తెర దించేస్తారు!

Update: 2021-06-12 01:30 GMT
2021-22 మోస్ట్ అవైటెడ్ మూవీ RRR రిలీజ్ స‌స్పెన్స్ కి తెర దించే టైమొచ్చిందా? అంటే అవున‌నే స‌మాచారం. జూలై నాటికి ఈ సినిమా రిలీజ్ తేదీపై మ‌రోసారి రాజ‌మౌళి స్ప‌ష్ట‌త‌నిచ్చేందుకు ప్రిప‌రేష‌న్ లో ఉన్నార‌ని తెలుస్తోంది.

నిజానికి ఒక భారీ పాన్ ఇండియా సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది! అంటే దాని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. ఇత‌ర నిర్మాత‌లంద‌రికీ అది టెన్ష‌న్ వ్య‌వ‌హారం. తేదీల క్లాష్ లేకుండా ఇత‌రులు ప్లాన్ చేస్కోవాల్సి ఉంటుంది. అందుకే ఇటీవ‌ల ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదీ చెప్పాల‌ని ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల నుంచి జ‌క్క‌న్న అండ్ టీమ్ పై ఒత్తిడి పెరిగింద‌ట‌. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదీపై క్లారిటీ వ‌చ్చేస్తే అటుపై ఇత‌ర సినిమాల ప్ర‌మోష‌న్ ని ప్రారంభించి రిలీజ్ తేదీల‌ను ప్ర‌క‌టించాల‌ని ప్లాన్ తో ఉన్నారు. ప్ర‌చారం రిలీజ్ అనేవి ఖ‌ర్చుతో కూడుకున్న‌వి కాబ‌ట్టి చాలా ముంద‌స్తు ప్లాన్ అవ‌స‌రం. అందుకే జ‌క్క‌న్న‌పై ఒత్తిడి పెంచుతున్నార‌ని తెలుస్తోంది.

ద‌స‌రా కానుక‌గా 2021 అక్టోబ‌ర్ 13న ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తామ‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌క‌టించారు. కానీ ఇంకా పెండింగ్ ఉన్న 20శాతం షూటింగ్ ముగించి గ్రాఫిక్స్ వ‌ర్క్ పూర్తి చేయాలంటే చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తాజా స‌న్నివేశంలో 2022 సంక్రాంతికి లేదా స‌మ్మ‌ర్ కి రిలీజ్ చేయాల‌ని జ‌క్క‌న్న భావిస్తున్నార‌ని కొత్త తేదీ ని ఆయ‌న వెల్ల‌డించే అవ‌కాశం ఉంద‌ని కూడా ప్ర‌చారం సాగుతోంది. ఏది ఏమైనా.. ఈసారి రిలీజ్ తేదీని ప్ర‌క‌టించే ముందు జ‌క్క‌న్న టీమ్ చాలా ఆలోచించాల్సి ఉంటుంది. సెకండ్ వేవ్ నెమ్మ‌దిస్తున్న క్ర‌మంలో పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ పూర్తి చేసి త్వ‌ర‌గా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ని ముగించేందుకు రాజ‌మౌళి టీమ్ ప్ర‌య‌త్నాల్లో ఉంది.

ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13 న విడుదల కాబోతుందని ఇప్పటికే ప్రకటించారు. ఇటీవల విడుదలైన తారక్ పుట్టినరోజు పోస్టర్ లో మేకర్స్ కరోనా కారణంగా తమ సినిమా వాయిదా పడే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. అయితే ఇంకా

బ్యాలన్స్ ఉన్న 20 శాతం షూటింగ్ తో పూర్తి చేయగలరా అనే సందేహాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే జూలైలో పరిశ్రమ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ ప్లాన్ ను తిరిగి ధృవీకరించాలని రాజమౌళి పై ఒత్తిడి వస్తుందట. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ని బట్టి మిగిలిన పెద్ద సినిమాలు వారి రిలీజ్ ల‌ను ప్లాన్ చేసుకుంటాం అని వారు అంటున్నారట. అంతేకాకుండా, ఈ చిత్రం వివిధ భాషలలో విడుదల కానుంది. అందుకని ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూటర్లు రిలీజ్ డేట్ ని తెలుసుకోవాలనుకుంటున్నారు. తద్వారా వారు తమ ప్రమోషన్లు అలాగే ఇతర ఆర్థిక విషయాలను ప్లాన్ చేసుకోవచ్చు. అందుకోసం జూలైలో విడుదల తేదీని రాజమౌళి స్పష్టం చేస్తారని వార్తలు వస్తున్నాయి. 2022 సంక్రాంతికి గానీ ఆ ఏడాది వేసవికి గానీ విడుదల అవ్వొచ్చని పుకార్లు ఉన్నాయి. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇద్దరూ వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి తమ ఇతర కమిట్మెంట్ల వైపు వెళ్ళడానికి ఆసక్తిగా ఉన్నారు. ఎన్టీఆర్ ఇప్పటికే కొరటాల శివ ప్రశాంత్ నీల్ తో సినిమాలు చెయ్యనున్నారు. రామ్ చరణ్ ఇప్పటికే శంకర్ తో సినిమా ఒకే చేశారు.
Tags:    

Similar News