RRR సినిమా థియేటర్లోకి వచ్చి బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టి ఆ తర్వాత ఓటీటీ లో కూడా సక్సెస్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు వచ్చి చాలా కాలం అవుతున్నా కూడా ఇంకా ఆ ఫీవర్ అయితే తగ్గడం లేదు. మరి కొన్ని గంటల్లో టెలివిజన్ ప్రీమియర్స్ కూడా మొదలవుతానున్నాయి.
ఇక ఇలాంటి సినిమాలపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కొంతమంది హాలీవుడ్ సినీ తారలు సైతం RRR సినిమా మేకింగ్ పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అందులోనే కొన్ని యాక్షన్ సన్నివేశాలను వారు ప్రత్యేకంగా పొగిడారు. దర్శక వీరుడు రాజమౌళి ఇద్దరు అగ్ర హీరోలను చూపించిన విధానం అన్ని రకాలుగా వర్కౌట్ అయింది.
రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ వారి పాత్రలతో భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇక పలు అవార్డుల వేడుకలలో కూడా ఇప్పుడు ఈ సినిమాల పేర్లు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
సైన్స్ ఫిక్షన్, హారర్ అలాగే ఫాంటసీ చిత్రాలను గౌరవించే సాటర్న్ అమెరికన్ అవార్డులకు ఈ చిత్రం నామినేట్ చేయబడింది. RRR సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ గా వర్క్ చేసిన శ్రీనివాస్ మోహన్ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు.
RRR ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ యాక్షన్/అడ్వెంచర్ చిత్రం మరియు ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అనే మూడు విభాగాల్లో నామినేట్ చేయబడింది. అవార్డు ప్రతిపాదనలో DC యొక్క బాట్‌మ్యాన్ మార్వెల్ యొక్క డాక్టర్ స్ట్రేంజ్, షాంగ్ చి మరియు స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ వంటివి ఉన్నాయి.
ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డు వేడుకలో హాలీవుడ్ బిగ్గీలతో పాటు తెలుగు సినిమా కూడా నామినేట్ కావడం ఒక హిస్టారికల్ ఫీట్ అని చెప్పవచ్చు. ఇక అక్టోబర్ 25న అవార్డులను ప్రకటిస్తారు. మరి ఈ వేడుకలో RRR సినిమా ప్రస్తావన అవార్డులను సొంతం చేసుకునే వరకు వెళుతుందా లేదా అనేది తెలియాలి అంటే కాలమే సమాధానం చెప్పలి.