గుణశేఖర్ భారీ బడ్జెట్‌తో రూపొందించిన చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవి రిలీజ్ కి రెడీ అయింది. సెప్టెంబర్ 4న రుద్రమదేవిని విడుదల చేయనున్నట్లు... నిర్మాతలు వెల్లడించారు. ఇప్పటివరకూ అనేకసార్లు వాయిదాపడ్డా... ఈసారి మాత్రం నిర్ణయించిన తేదీకే రిలీజ్ ఖాయమంటున్నారు చిత్ర యూనిట్. హైద్రాబాద్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో... ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.
అనుష్క లీడ్ రోల్ చేసిన ఈ సినిమా చిత్రీకరణ... రెండేళ్లకు పైగా పట్టింది. పూర్తైన తర్వాత కూడా విడుదల కోసం అనేక కష్టాలు ఎదురయ్యాయి. బాహుబలి కంటే ముందే థియేటర్ల లోకి తెచ్చేందుకు.. గుణశేఖర్, నిర్మాతలు శతవిధాలా కృషి చేశారు. అయినా.. విడుదల మాత్రం సాధ్యపడలేదు. ఇప్పుడు బాహుబలికి వచ్చిన రెస్పాన్స్ చూశాక.. ఇదే జోనర్ లోని తమ చిత్ర విజయంపై రుద్రమ నిర్మాతలకు ధైర్యం పెరిగింది.
రుద్రమదేవిని గుణశేఖర్ 3డీలో చిత్రీకరించారు. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ చేసిన పాత్ర... ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. చాళుక్య వీరభద్రునిగా రాణా నటించారు. కృష్ణంరాజు, నిత్యామీనన్, కేథరిన్ థెరిసాలు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇళయరాజా సంగీత స్వరపరచిన ఈ చిత్రానికి.. తోట తరణి ఆర్ట్ డైరెక్షన్ చేశారు.
సెప్టెంబర్ 4 అంటే.. అప్పటికి శ్రీమంతుడు రిలీజై 4వారాలు పూర్తైపోతుంది. ఆ నెలలో రిలీజ్ కోసం షెడ్యూల్ చేసిన పెద్ద సినిమాలు కూడా లేవు. అందుకే రుద్రమ విడుదల కోసం... గుణశేఖర్ ఈ డేట్ ఎంచుకున్నట్లు సమాచారం.