బాలయ్య ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్న రూలర్!

Update: 2019-12-23 10:01 GMT
నందమూరి బాలకృష్ణ నటించిన 'రూలర్' డిసెంబర్ 20 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఎంత తక్కువ అంచనాలతో ప్రేక్షకులు థియేటర్ కు వెళ్ళిన ఆ అంచనాలు కూడా అందుకో లేకపోయింది.  రివ్యూస్.. మౌత్ టాక్ అంతా నెగెటివ్ గా ఉండడం తో సినిమా కలెక్షన్స్ రెండో రోజు నుంచి దారుణం గా పడి పోయాయి.

'రూలర్' మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4 కోట్ల షేర్ సాధించింది.  బాలయ్య సినిమాల కు ఈ ఫస్ట్ డే షేర్ తక్కువే కానీ 'రూలర్' కు రిలీజ్ ముందున్న బజ్ ప్రకారం చూసే మంచి వసూళ్లే.  అయితే మొదటి రోజు బాలయ్య తన సత్తా చాటినప్పటికీ బ్యాడ్ టాక్.. ట్రోలింగ్ ఎక్కువ కావడం తో రెండో రోజుకే ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై చూపించింది.  రెండో రోజు 'రూలర్' కనీసం కోటి రూపాయల షేర్ తెచ్చుకోలేక చతికిల పడింది.  వీకెండ్ లోనే పరిస్థితి ఇలా ఉంటే సోమవారం తర్వాత 'రూలర్' కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఎవరైనా ఒక అంచనాకు రాగలరు.

'రూలర్' రూ.15 కోట్ల డెఫిసిట్ తో రిలీజ్ అయిందనే సంగతి తెలిసిందే.  ఇంత డెఫిసిట్ తో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు ఫుల్ రన్ లో 10 కోట్ల మార్క్ చేరుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు.  ఈ ఏడాది బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు డిజాస్టర్లు గా నిలిచాయి.  మొదటి భాగం కలెక్షన్స్ పరవాలేదు అనిపించుకున్నా రెండవ భాగం ఫలితం బాలయ్య కెరీర్ లోనే ఒక చేదు అనుభవంలాగా మిగిలింది. ఇప్పుడు 'రూలర్' పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు.  ఈ కలెక్షన్స్ రేంజ్ చూస్తుంటే బాలయ్య సినిమాల కు సాధారణ ప్రేక్షకులే కాదు.. నందమూరి అభిమానుల లో కూడా ఒక సెక్షన్ దూరంగా ఉంటున్నారనే అభిప్రాయం జోరు గా వినిపిస్తోంది. ఈ కలెక్షన్ ఫిగర్లు చూస్తుంటే "ట్రెండ్ తో నాకు పని లేదు..నేను కొత్త సినిమాలు చూడను"  అనే బాలయ్య అభిప్రాయం ఇక మార్చు కోక తప్పేలా లేదు.
Tags:    

Similar News