దాదాపు మూడేళ్ల క్రితం 'బాహుబలి' అనౌన్స్ చేసినప్పటి నుంచి వార్తల్లో ఉంటోందా సినిమా. రెండేళ్ల కిందట ప్రి ప్రొడక్షన్ పనులతో మొదలైన హంగామా ఇప్పుడు బాగా ఊపందుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'బాహుబలి' చర్చ నడుస్తోంది. గత 25 రోజుల్లో రాజమౌళి విడుదల చేసిన పోస్టర్ల గురించి బాలీవుడ్ జనాలు కూడా బాగానే చర్చించుకుంటున్నారు. ఇంత చర్చకు దారితీస్తున్న 'బాహుబలి'లో కళ్లు చెదిరే యుద్ధ సన్నివేశాలు.. అత్యద్భుతమైన గ్రాఫిక్స్ ఉంటాయని ముందే జనాలు ఓ అంచనాకు వచ్చేస్తున్నారు. ప్రధానంగా టేకింగ్‌తోనే జక్కన్న జనాల్ని కట్టిపడేస్తాడని తెలుసు.
కాబట్టి కథ గురించి జనాలకు పెద్దగా ఆలోచన లేదు. ఐతే బాహుబలి కథ గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యుద్ధం నుంచి శాంతికి పరివర్తన చెందిన మహావీరుడి జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని కొందరు.. అదేం కాదు ఇదో కల్పిత గాథ.. రాజ్యాధికారం కోసం పెదనాన్న, చిన్నాన్న పిల్లల మధ్య సాగే పోరాటం నేపథ్యంలో ఈ కథను విజయేంద్ర ప్రసాద్ రచించారని.. పగ, ప్రతీకారం, అసూయల మధ్య సినిమా నడుస్తుందని ఇంకొందరు అంటున్నారు. ఈ మధ్య ప్రభాస్ ఓసారి అధికారం కోసం సాగే పోరాటం నేపథ్యంలో సినిమా ఉంటుందని హింట్ ఇచ్చాడు. మొత్తానికి కథ ఎలాంటిదైనా.. తనదైన శైలిలో కథనంతో మ్యాజిక్ చేయడం జక్కన్నకు వెన్నతో పెట్టిన విద్య. బాహుబలి కథ విషయంలోనూ ఇలాగే చేసి ఉంటాడని అభిమానుల నమ్మకం.