ఒక గొప్ప పేరున్న దర్శకుడి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ చేతికి వచ్చాక అసలు బాలేదని దాని విడుదల ఆపేయడం బహుశా అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ వర్మ విషయంలోనే జరిగింది. బాలా లాంటి కల్ట్ డైరెక్టర్ కి ఇది అవమానమే. సరే ఏదో జరిగిపోయింది దాన్నెందుకు రచ్చ చేసుకోవడం అంటూ ఆయన సైలెంట్ అయిపోయారు .
సందీప్ రెడ్డి వంగా అసిస్టెంట్ గిరిసాయాతో ఇంకో వెర్షన్ రీమేక్ ని ఎక్కువ ఆలస్యం చేయకుండా ఆదిత్య వర్మ పేరుతో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే గత కొద్దిరోజులుగా ఇది కూడా ఆగిపోయిందని విసుగొచ్చిన నిర్మాత ఒరిజినల్ అర్జున్ రెడ్డినే తమిళ్ లో డబ్ చేసి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారని చెన్నై మీడియాలో కాస్త జోరుగానే ప్రచారం జరిగింది
ఇది నిజమని నమ్మే తరహాలో సోషల్ మీడియాలో సైతం ఈ వార్తలు హల్చల్ చేశాయి. విక్రం కొడుకు మొదటి సినిమాకే ఇలా కావాలా అని చియాన్ ఫ్యాన్స్ బాధ పడిపోయారు. కాని నిర్మాత నుంచి క్లారిటీ వచ్చేసింది. ఆదిత్య వర్మ ఆగిపోలేదని శుభ్రంగా షూటింగ్ జరుపుకుంటూ జూలై విడుదలకు రెడీ అవుతోందని వీటికి చెక్ పెట్టేశాడు. ప్రస్తుతం ఈ టీం ఓ పాట షూటింగ్ కోసం పోర్చుగల్ లో ఉంది. అది పూర్తి చేసుకుని వచ్చాక తిరిగి టాకీ పార్ట్ కంటిన్యూ చేస్తారు. తక్కువ గ్యాప్ లో హింది వెర్షన్ కబీర్ సింగ్ తమిళ్ ఆదిత్య వర్మలు విడుదలకు సిద్ధపడటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.