ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదలై సంచలన వసూళ్లతో దూసుకెళ్లింది ‘బాహుబలి: ది కంక్లూజన్’. ఏకంగా రూ.1750 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమా ఇది. అప్పుడు ఇండియాతో పాటు విదేశాల్లోనూ తెలుగు.. తమిళం.. హిందీ.. మలయాళ వెర్షన్లు రిలీజయ్యాయి. ఇప్పుడు కొంత విరామం తర్వాత ‘బాహుబలి-2’ డబ్బింగ్ వెర్షన్లు మరిన్ని దేశాల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇంకో మూడు రోజుల్లోనే జపాన్ లో ‘బాహుబలి-2’ జపనీస్ వెర్షన్ పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఇంకో రెండు వారాల వ్యవధిలో ‘ది కంక్లూజన్’ ఇంకో విదేశీ భాషలో విడుదల కాబోతుండటం విశేషం.
‘బాహుబలి: ది కంక్లూజన్’ రష్యన్ భాషలోకి కూడా అనువాదం చేశారు. జనవరి 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ‘బాహుబలి-2’ రష్యన్ ట్రైలర్ కూడా తీర్చిదిద్దడం విశేషం. ‘ది కంక్లూజన్’లో కళ్లు చెదిరే షాట్స్ లెక్కలేనన్ని ఉన్నాయి. వాటిలోంచి ఎన్నదగ్గవి తీసుకుని ట్రైలర్ ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. తెలుగు ట్రైలర్ తో పోలిస్తే ఇది కొంచెం భిన్నంగా ఉంది. మనం చూసిన ట్రైలర్లోని సీన్స్ కూడా ఉన్నాయి కానీ.. దాంతో పోలిస్తే ఇది కొత్తగా అనిపిస్తోంది. చాలా వరకు ఫాస్ట్ పేస్డ్ గా ఉంది ట్రైలర్. సినిమాలో స్పెక్టాకులర్ అనిపించే షాట్స్ అన్నింటినీ గుదిగుచ్చి ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘బాహుబలి’ ట్రైలర్ రష్యన్ భాషలో చూస్తుంటే అభిమానులకు కొత్తగా.. కొంచెం ప్రౌడ్ గా కూడా అనిపిస్తుందనడంలో సందేహం లేదు.
Full View