న్యాచురల్ స్టార్ నాని జెర్సీ వచ్చే నెల 19న విడుదలకు రెడీ అవుతోంది. మొదటిసారి క్రికెటర్ గా నటిస్తుండటం పట్ల ఇప్పటికే ప్రేక్షకుల్లోనూ ఆసక్తి ఉంది. అయితే గత కొంత కాలంగా క్లైమాక్స్ విషయంలో రకరకాలుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ట్రాజెడీతో ఇది ముగుస్తుందని భీమిలి కబడ్డీ జట్టు తరహలో ఇది వర్క్ అవుట్ అవుతుందా అనే అనుమానాలు గతంలోనూ తుపాకీ వ్యక్తపరిచింది. రెండు వెర్షన్లు షూట్ చేశారని ఒకటి పాజిటివ్ గా మరొకటి నెగటివ్ గా ఉన్నాయని త్రివిక్రమ్ దిల్ రాజు చూసాక ఒకటి నిర్ణయిస్తారనే ప్రచారం కూడా జరిగింది.
అయితే విశ్వసనీయ సమాచారం మేరకు జెర్సీలో సాడ్ ఎండింగ్ కె యూనిట్ మొగ్గు చూపినట్టు తెలిసింది. సహజత్వం కోసం చెప్పాలనుకున్న ఎమోషన్ తెరమీద ప్రెజెంట్ కావాలి అంటే ఇలా చేయక తప్పదని ఫిక్స్ అయ్యారట. ఇది విడుదల రోజు సినిమా చూసే దాకా అధికారికంగా చెప్పే అవకాశం లేదు. ఒకవేళ నానిని నిజంగా అలా చూపిస్తే అభిమానులు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనే అనుమానాలు లేకపోలేదు.
ఒక ఇమేజ్ వచ్చాక హీరోలకు ఇలాంటి క్లైమాక్స్ లు పరీక్ష లాంటివి. ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితం మీద అదే ప్రభావం చూపుతుంది. 38 ఏళ్ళ అతి చిన్న వయసులో గ్రౌండ్ లోనే ప్రాణాలు వదిలిన రమణ్ లాంబా అనే క్రికెటర్ కథ ఆధారంగా రూపొందుతున్న జెర్సీ కు అజ్ఞాతవాసి తర్వాత అనిరుద్ రవి చందర్ సంగీతం అందించడం విశేషం. త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు