యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేయబోతున్న కొరటాల శివ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. RRR తో వచ్చిన క్రేజ్ ని రెట్టింపు చేసేలా తన నెక్స్ట్ సినిమా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో 30వ సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయగా అందుకు తగినట్టుగా కాస్టింగ్ కూడా ఉండేట్లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ని ఫిక్స్ చేశారు. శ్రీదేవి తనయురాలు తెలుగులో చేస్తున్న మొదటి సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై సూపర్ హైప్ వచ్చేస్తుంది.
ఇక విలన్ గా కూడా ముందు సంజయ్ దత్ అనుకున్నా లేటెస్ట్ గా ఆదిపురుష్ విలన్ అదే సైఫ్ అలి ఖాన్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. కొరటాల శివ రాసుకున్న విలన్ పాత్రకు సైఫ్ అయితే పర్ఫెక్ట్ అని భావిస్తున్నారట. అందుకే అతన్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
సైఫ్ కూడా సౌత్ సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ కు ఈక్వల్ గా విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ 30వ సినిమాలో సైఫ్ అలి ఖాన్ డిఫరెంట్ విలన్ గా కనిపిస్తారని అంటున్నారు.
జనతా గ్యారేజ్ తో సూపర్ హిట్ కొట్టిన ఎన్.టి.ఆర్, కొరటాల శివ కాంబో ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాలని చూస్తున్నారు. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. ఎన్.టి.ఆర్ 30వ సినిమా హిట్టు కొట్టి మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేయాలని అనుకుంటున్నాడు.
ఈ సినిమా 2022 సంక్రాంతికి ముహూర్తం పెట్టుకుంటారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్, జాన్వి కపూర్, సైఫ్ అలి ఖాన్ ఇలా తారాగణం చాలా పెద్దదిగానే ఉంటుందని అర్థమవుతుంది.
RRR తర్వాత తారక్ తన నెక్స్ట్ సినిమా చేసేందుకు చాలా లేట్ చేసినా ఈ గ్యాప్ కి తగినంత అవుట్ పుట్ ఇస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ లో అతను చేసిన పాత్రతో నేషనల్ వైడ్ ఆడియన్స్ ని ఒప్పించిన తారక్ కొరటాల శివ సినిమాతో నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడని చెప్పొచ్చు. 2023 ఎండింగ్ కల్లా తారక్ 30వ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ మరి అది ఎంతవరకు కుదురుతుంది అన్నది తెలియాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.