అక్కినేని నాగ చైతన్య తాజా చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు' ఆగష్టు 31 న విడుదల చేసేందుకు ఫిలింమేకర్స్ నిర్నయించారన్న విషయం తెలిసిందే. కానీ తాజాగా ఫిలిం నగర్లో సర్కులేట్ అవుతున్న గాసిప్ ప్రకారం అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల ఆయ్యే అవకాశం లేదట.
కారణం ఏంటంటే కేరళ వరదలు. మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ప్రస్తుతం 'శైలజారెడ్డి అల్లుడు' సినిమా రీరికార్డింగ్ పనులతో బిజీగా ఉన్నాడు. ఈ పనులను దగ్గరుండి చూసుకునేందుకు డైరెక్టర్ మారుతి ఈమధ్యే కేరళకు వెళ్ళాడట. కానీ విరామం లేకుండా కురుస్తున్న వర్షాలు.. దానివల్ల వచ్చిన వరదల కారణంగా మారుతి అక్కడే చిక్కుకున్నాడని దాంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అవుతోందని అంటున్నారు.
మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా చేద్దామని - యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను చీఫ్ గెస్ట్ గా పిలుద్దామని కూడా ప్లాన్ చేశారట. కానీ ఇప్పుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్ మాత్రం దాదాపు క్యాన్సిల్ అయినట్టే అంటున్నారు. ఒకవేళ వర్క్స్ డిలే అయ్యే సమయంలో సెప్టెంబర్ 4 న సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. మరో రెండు రోజుల్లో ఈ విషయం పై క్లారిటీ రావొచ్చని సమాచారం.