సాయిమాధవ్ బుర్రా .. పరిచయం అవసరం లేని పేరు. రచయితగా వరుస సినిమాలతో ఆయన ఫుల్ బిజీ. పాత్రకి తగినట్టుగా .. పాత్ర స్వభావానికి తగినట్టుగా .. సందర్భానికి తగినట్టుగా ఆయన చాలా గొప్పగా డైలాగులు రాస్తారని పేరు ఉంది. అలాగే పవర్ఫుల్ డైలాగులు రాయడంలోను .. సున్నితమైన ఒక చిన్న డైలాగ్ తోనే మనసును భారం చేయగలగడంలోను ఆయన సిద్ధహస్తుడు. ఇక సాంఘిక చిత్రాలతోనే కాదు .. పౌరాణిక .. జానపద .. చిత్రాలలో ఏ పాత్రకి ఎలాంటి మాటలు రాయాలనేది ఆయనకి బాగా తెలుసు. 'గౌతమీ పుత్ర శాతకర్ణి' నుంచి ఆయన మరింత బిజీ అయ్యారు.
సాధారణంగా ఎవరైనా తాము పనిచేసిన సినిమాలలో ఏ సినిమా ఇష్టమని అడిగితే, వాటిలో హిట్ అయిన ఒక సినిమా పేరు చెబుతారు. కానీ సాయిమాధవ్ బుర్రా మాత్రం అందుకు భిన్నమైన సమాధానం ఇచ్చాడు. అలా అని చెప్పేసి తాను పని చేసినవాటిలో ఫ్లాప్ అయిన సినిమా తనకి ఇష్టమని చెప్పలేదు. సూపర్ హిట్ అయిన సినిమా తనకి నచ్చలేదని నిర్మొహమాటంగా చెప్పాడు. ఆయన చెప్పిన ఆ సినిమా పేరే 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు. శర్వానంద్ - నిత్యామీనన్ జంటగా నటించిన ఈ సినిమాకి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు. 2015లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాను గురించి సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ .. "నేను వర్క్ చేసిన సినిమాలలో 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమా నాకు ఎంత మాత్రం నచ్చదు. ఆ సినిమాలో నా మాటలకూ మంచి పేరు వచ్చింది. అయితే ఆ సినిమాలో మాటలు తప్ప మరేమీ ఉండదు. ప్రతి సన్నివేశంలో ఇద్దరు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు డైలాగులు కాకుండా ఇంకా ఏం ఉంటాయి. నిజానికి నేను ఎంతో మనసు పెట్టి డైలాగులు రాశాను. ఆ డైలాగులు అంటే నాకు చాలా ఇష్టం .. కానీ అవి తప్ప అందులో మరేమీ లేదు. అందువల్లనే ఆ సినిమా నాకు నచ్చదు" అని చెప్పాడు.
ఇక ఇటీవల విడుదలైన 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి సాయి మాధవ్ బుర్రానే సంభాషణలు అందించాడు. 'సీత కనిపించింది .. కళ్లు తెరిపించింది' .. ' ఆయన చేసేది ఉద్యోగం కాదు .. ఉద్యమం' .. 'నేను మల్లి కోసం పోరాడుతున్నాను .. నువ్వు మట్టి కోసం పోరాడుతున్నావు' .. 'భీమ్ .. భారతీయుల ప్రాణం కంటే విలువైన బుల్లెట్ ని తిరిగి ఇచ్చేయ్ .. గుండెల్లో దాచు కుంటాడు' వంటి డైలాగ్స్ గుర్తుండి పోతాయి. ఒక వైపున రాజమౌళి .. మరో వైపున విజయేంద్ర ప్రసాద్ కూడా సాయిమాధవ్ బుర్రా ప్రతిభను అభినందించడం విశేషం.