1000 కోట్లా? బిగ్ బాస్ కి అంత వ‌ర్కౌట్ అవుద్దా?

Update: 2022-07-15 00:30 GMT
బాలీవుడ్ లో బిగ్ బాస్ ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో?  చెప్పాల్సిన ప‌నిలేదు. 15 ఏళ్ల‌గా హిందీలో బిగ్ బాస్ దిగ్విజ‌యంగా  కొన‌సాగుతుందంటే? నిర్వాహ‌కులు ఎలాంటి ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకెళ్లి ఇంత‌గా స‌క్సెస్ సాధించారో?  విశ్లేషించాల్సిన అవ‌స‌రం ముంది. సౌత్ లో  త‌మిళం..తెలుగు భాషల్లో బిగ్ బాస్ ప్రారంభం అవ్వ‌డానికి కార‌ణం హిందీ ఎపిసోడ్లు స్పూర్తి అని చెప్పాల్సిన ప‌నిలేదు.

ప్ర‌తీ ఏడాది బిగ్ స్పాన్ అంత‌కంత‌కు పెరుగుతుందే త‌ప్ప తగ్గుతోన్న దాఖ‌లాలు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. కోలీవుడ్..టాలీవుడ్ లోనూ పెద్ద స‌క్సెస్ అయింది. ఇప్ప‌టికే కొన్ని సీజ‌న్లు సైతం దిగ్విజ‌యంగా పూర్తిచేసుకున్నాయి. ఇక హిందీలో రెట్టించిన ఉత్సాహంతోన ఏడాది ఏడాదికి స్పాన్ పెంచుకుంటూ పోతున్నారు. బిగ్ బాస్ ద్వారా కోట్ల రూపాయ‌ల వ్యాప‌రం జ‌రుగుతోంది.

హిందీ టీవీ ఛానెల్స్ రేటింగ్ మెరుగు ప‌డటంలో బిగ్ బాస్ కీల‌క పాత్ర పోషించింది. తాజాగా  హిందీ వెర్ష‌న్ 16వ సీజ‌న్ కి బిగ్ బాస్ రెడీ అవుతోంది. ఈ సీజ‌న్ హోస్ట్ బాధ్య‌త‌లు బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ కి అప్ప‌గించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ఎక్కువ సీజ‌న్లు హోస్ట్ చేసింది స‌ల్మాన్ కావడం విశేషం. స‌ల్మాన్ హోస్ట్ చేస్తే షో పెద్ద స‌క్సెస్ అవుతుంద‌న్న‌ది అక్క‌డ సెంటిమెంట్ గా మారిపోయింది.

అందుకే నిర్వాహ‌కులు వీలైనంత వ‌ర‌కూ స‌ల్మాన్ కే బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు.  బిగ్ బాస్ తొలి సీజ‌న్ హ‌ర్ష‌ద్ వార్షి హోస్ట్ చేసారు. ఆ త‌ర్వాత శిల్పాశెట్టి..అమితాబ‌చ్చ‌న్.. సంజ‌య్ ద‌త్..ప‌ర్హాన ఖాన్ చాలా మంది హోస్ట్ చేసారు. కానీ వాళ్లెవ్వ‌రికీ రానంత గుర్తింపు  స‌ల్మాన్ ఖాన్ సీజ‌న్ల‌కి వచ్చింది. ఆ ర‌కంగా స‌ల్మాన్ బిగ్ బాస్ కి ఓ బ్రాండ్ లా మారిపోయారు.

అయితే బిగ్ బాస్ ద్వారా భాయ్ కి అంత ఆదాయం స‌మ‌కూర‌లేదు? అని చాలా  కాలంగానే వినిపిస్తోంది. గ‌త సీజ‌న్ల‌కి భాయ్ 350 కోట్ల వ‌ర‌కూ భారీ పారితోషికం తీసుకున్నారు. అంత‌కు ముందు బిగ్  బాస్ కి భాయ్ కి ఇచ్చింది త‌క్కువే అన్న కార‌ణం బాలీవు్ లో  కొన్నాళ్ల క్రితమే తెర‌పైకి వ‌చ్చింది.  మ‌రి ఆ కార‌ణ‌మా? ఇంకేదైనా రీజ‌న్ ఉందా? అన్న‌ది తెలియ‌దు గానీ తాజా సీజ‌న్ కి భాయ్ ఏకంగా 1000 కోట్లకు పైగా  పారితోషికం డిమాండ్ చేస్తున్నారు? అన్న  వార్త ఒక‌టి  తెర‌పైకి వస్తుంది.

హిందీ స‌హా ఇత‌ర ఉత్త‌రాది భాష‌ల్లో బిగ్ బాస్ క్రేజ్ చూసే భాయ్ ఈ ఫిగ‌ర్  కోట్ చేస్తున్నార‌ని వినిపిస్తుంది. మ‌రి ఆ సంగ‌తేంటో తేలాలంటే  కొన్ని రోజులు ఆగాల్సిందే.  1000 కోట్లు పారితోషికం స‌ల్మాన్ కి ఇచ్చి బిగ్ బాస్ ని కొన‌సాగించే స‌త్తా నిర్వాహ‌కులకు ఉందా? అన్న‌ది ఓ సందేహ‌మే.
Tags:    

Similar News