సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన `మహర్షి` నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజైంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో కథానాయిక. అల్లరినరేష్ మరో కీలక పాత్రను పోషించారు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమా గురించి అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు. మరోవైపు మహేష్ తో ఈ పాతిక సినిమాల పయనంలో కలిసి పని చేసిన స్టార్లు.. దర్శకుల వీడియోల్ని సేకరించి నమ్రత ప్రచారం చేస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. తెలంగాణలో `మహర్షి` రోజూ ఐదు ఆటల్ని ఆడిస్తున్నారు. అటు ఏపీలోనూ అభిమానుల కోసం స్పెషల్ షోలు.. బెనిఫిట్ షోలు అంటూ హడావుడి నెలకొంది. ఓవర్సీస్ లో ఏకంగా 2500 పైగా ప్రీమియర్లు ప్లాన్ చేశారంటే మహర్షి దూకుడు గురించి అర్థం చేసుకోవచ్చు.
మహేష్ నటించిన ఈ సినిమా రిజల్ట్ కోసం అటు బాలీవుడ్ స్టార్లు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తుండడం ఆసక్తికరం. గత కొంతకాలంగా ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు ఆసక్తిగా చూస్తోంది. ఇక్కడ సినిమాల్ని రీమేక్ చేసేందుకు ఇరుగు పొరుగు పరిశ్రమలు ఎగ్జయిట్ మెంట్ కనబరుస్తున్నాయి. అందుకే మహర్షి రిపోర్ట్ కోసం మరీ ఇంతగా ఎగ్జయిట్ అవుతున్నారని అర్థమవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. నేడు ప్రభుదేవా తో కలిసి కండల హీరో సల్మాన్ ఖాన్ ముంబైలో `మహర్షి` సినిమాని వీక్షిస్తారని తెలుస్తోంది. భాయ్ ప్రత్యేకించి ఈ సినిమాపై ఆసక్తి కనబరచడానికి ఓ కారణం ఉంది. ఒకవేళ సినిమా కథాంశం నచ్చితే రీమేక్ రైట్స్ కొనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయంలో దిల్ రాజు కాంపౌండ్ లో ఎగ్జయిట్ మెంట్ కనిపిస్తోందని సమాచారం.
ఇటీవలే `ఎఫ్ 2` తో బ్లాక్ బస్టర్ కొట్టిన దిల్ రాజు ఆ వెంటనే బాలీవుడ్ లో ప్రీమియర్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అటుపై పాపులర్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నామని ప్రకటించారు. బాలీవుడ్ లో అనీష్ భజ్మి దర్శకత్వంలో బోనీకపూర్- దిల్ రాజు సంయుక్తంగా ఎఫ్ 2ని రీమేక్ చేస్తున్నారని వార్తలొచ్చాయి. ఇదే నేపథ్యంలో `మహర్షి` హిందీ రీమేక్ ఆలోచనలు దిల్ రాజు మైండ్ లో బలంగానే పాదుకున్నాయని తెలుస్తోంది. తొలి నుంచి `మహర్షి` సక్సెస్ విషయమై రాజుగారు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇందులో కంటెంట్ .. యూనివర్శల్ అప్పీల్ తో ఉంటుందని పదే పదే చెబుతూనే ఉన్నారు. అందుకే ఈ సినిమా హిందీలోనూ వర్కవుటవుతుందన్న ముచ్చటా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ కాంపౌండ్ లో బలంగా వినిపిస్తోంది. ఇక హిందీ పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకెళ్లే ఆలోచనలోనూ దిల్ రాజు ఉన్నారని ఇటీవల ప్రచారం సాగిన సంగతి తెలిసిందే.
మరో కోణంలో పరిశీలిస్తే ..మహేష్ తో సల్మాన్ అనుబంధం ఇప్పటిది కాదు. సంచలనాల `పోకిరి` చిత్రాన్ని ప్రభుదేవా దర్శకత్వంలో హిందీలో వాంటెడ్ (2009) పేరుతో రీమేక్ చేస్తే అక్కడా సంచలన విజయం సాధించింది. బాలీవుడ్ లో తొలి 100 కోట్ల క్లబ్ చిత్రంగా `వాంటెడ్` రికార్డులకెక్కింది. అప్పటి నుంచి మహేష్ నటించే సినిమాలను ప్రత్యేకించి సల్మాన్ వీక్షిస్తుంటారు. రీమేక్ ఆలోచనతోనే సల్మాన్ భాయ్ ప్రత్యేకించి మహర్షి షో వీక్షిస్తున్నారని తెలుస్తోంది. ఇక మహర్షి చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు ఇలయదళపతి విజయ్ ఆసక్తిగా ఉన్నారని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.