స్టార్ టీవీతో హృతిక్ రోషన్ రూ.550 కోట్ల డీల్ గురించి దేశవ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమలూ చర్చించుకుంటుండగా.. దాన్ని తలదన్నే డీల్ తో వచ్చేశాడు సల్మాన్ ఖాన్. హృతిక్ ఏ ఛానెల్ తో అయితే రూ.550 కోట్ల డీల్ చేసుకున్నాడో.. అదే ఛానెల్ తో రూ.1000 కోట్ల డీల్ కుదుర్చుకుని భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. ఇంతకీ ఏంటా డీల్.. ఏమా కథ.. చూద్దాం పదండి.
మన దేశంలో ఒక హీరో నటించే కొన్ని సినిమాలకు సంబంధించి ఒకేసారి శాటిలైట్ డీల్ చసుకోవడం అన్నది స్టార్ టీవీ మొదలుపెట్టిన కాన్సెప్ట్. ఆల్రెడీ ఆ ఛానెల్ కు సల్మాన్ ఖాన్ తో 2018 వరకు డీల్ ఉంది. అది కొన్ని వందల కోట్లకు కుదిరింది. ఆ తర్వాత వరుణ్ ధావన్ తో రూ.300 కోట్లకు ఆ ఛానెల్ ఒప్పందం కుదుర్చుకుంది. లేటెస్టుగా హృతిక్ రోషన్ నటించబోయే ఆరు సినిమాలకు కలిపి ఏకంగా రూ.550 కోట్లకు శాటిలైట్ డీల్ కుదుర్చుకుని ఔరా అనిపించింది స్టార్ టీవీ.
ఐతే ఈ డీల్స్ అన్నింటినీ మించిపోతూ.. సల్మాన్ ఖాన్ అదే ఛానెల్ తో రూ.1000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీని ప్రకారం సల్మాన్ హీరోగా నటించే పది సినిమాల శాటిలైట్ హక్కులు ఆ ఛానెల్ కే సొంతమవుతాయి. అంతే కాదు.. ఆ ఛానెల్లో నిర్వహించే అవార్డుల కార్యక్రమాలతో పాటు కొన్ని ప్రమోషనల్ ఈవెంట్లకు కూడా సల్మాన్ హాజరు కావాల్సి ఉంటుంది. రూ.1000 కోట్లు వచ్చిపడుతున్నపుడు అవార్డు వేడుకలకు, ప్రమోషనల్ ఈవెంట్లకు వెళ్లడం పెద్ద విషయమా..?