బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ''రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్'' ట్రైలర్ వచ్చేసింది. డ్రగ్ మాఫియాను అంతం చేసే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా విభిన్న గెటప్ లో సల్మాన్ ఆకట్టుకుంటున్నాడు. తన సినిమాలలో తెలుగు చిత్రాల రెఫరెన్స్ వాడుకునే సల్లూ భాయ్.. 'రాధే' కోసం తెలుగు పాటను రీమిక్స్ చేశారు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'డీజే-దువ్వాడ జగన్నాథం' చిత్రంలోని 'సీటీమార్' అనే సాంగ్ ని ఇందులో రీమిక్స్ చేశారు. ఈ పాటలో దిశా పటానీతో కలిసి సల్మాన్ వేసిన స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హిందీలో కూడా దేవిశ్రీప్రసాద్ ట్యూన్ సమకూర్చినప్పటికీ.. కొరియోగ్రఫీ కూడా తెలుగు పాటనే పోలి వుండటం గమనార్హం.
ఇంతకముందు సల్మాన్ ఖాన్ తెలుగులో హిట్ అయిన 'పోకిరి' చిత్రాన్ని 'వాంటెడ్' గా రీమేక్ చేసి హిట్ కొట్టాడు. అలానే 'రెడీ' 'కిక్' చిత్రాలను అదే పేరుతో రీమేక్ చేశారు. 'స్టాలిన్' చిత్రాన్ని 'జయహో' పేరుతో తెరకెక్కించారు. ఇక 'ఆర్య 2' సినిమాలోని 'రింగ రింగ' పాటను 'రెడీ' చిత్రం కోసం రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 'రాధే' కోసం మరోసారి బన్నీ నటించిన సినిమాలోని పాట ట్యూన్ ను సల్మాన్ వాడుకున్నాడు. సౌత్ డైరెక్టర్ ప్రభుదేవా రూపొందించిన సినిమా కావడం వల్లనో ఏమో ఈ ట్రైలర్ లో సన్నివేశాలు డైలాగ్స్ తెలుగు సినిమాలను గుర్తుకు తెస్తున్నాయి. సౌత్ కొరియన్ మూవీ 'వెటరన్' కు రీమేక్ అని చెప్తున్నప్పటికీ.. హీరో క్యారెక్టరైజేషన్ - డైలాగులు చూస్తుంటే 'పోకిరి' చిత్రానికి సీక్వెల్ లా అనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, 'రాధే' సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లతో పాటు 'పే పర్ వ్యూ' పద్ధతిలో జీ ప్లెక్స్ - డిష్ టీవీ - డీటుహెచ్ - టాటా స్కై - ఎయిర్ టెల్ డిజిటల్ టీవీల్లోనూ ఒకేసారి ఈ సినిమా అందుబాటులోకి వస్తుంది. తెలుగు సినిమా రెఫరెన్స్ లతో వస్తున్న సల్మాన్ ఖాన్ మరో మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.