విజయ్ - సమంతల ముందు తేలిపోయిన బాలీవుడ్ స్టార్స్..!

Update: 2022-08-01 18:30 GMT
బాలీవుడ్ ఫిలిం కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న 'కాఫీ విత్ కరణ్' టాక్ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలబ్రిటీలు గెస్టులుగా పాల్గొనే ఈ కార్యక్రమం.. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇటీవలే 7వ సీజన్ ప్రారంభమైంది. ఈసారి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

కాఫీ విత్ షోలో ఎక్కువగా బాలీవుడ్ సెలబ్రిటీలే అతిథులుగా పాల్గొంటూ వచ్చారు. అప్పుడప్పుడు రాజమౌళి - ప్రభాస్ - రానా దగ్గుబాటి వంటి పలువురు దక్షిణాది ప్రముఖులు ఈ ప్రోగ్రామ్ లో సందడి చేశారు. ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన సీజన్ లో ఇప్పటికే ఇద్దరు సౌత్ సెలబ్రిటీలు కరణ్ చిట్ చాట్ షోలో కనిపించారు.

ఫస్ట్ ఎపిసోడ్ కు బాలీవుడ్ స్టార్స్ రణవీర్ సింగ్ మరియు అలియా భట్ గెస్టులుగా హాజరవ్వగా.. రెండో ఎపిసోడ్ లో బీటౌన్ బ్యూటీలు సారా అలీఖాన్ - జాన్వీ కపూర్ పాల్గొన్నారు. మూడో ఎపిసోడ్ లో అక్షయ్ కుమార్ - సమంత రూత్ ప్రభు కనిపించారు. ఈ క్రమంలో ఇటీవలి ఎపిసోడ్ లో 'లైగర్' జోడీ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ - బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కలసి అలరించారు.

చాలా వరకు ముంబై సెలబ్రిటీలకే ప్రాధాన్యత ఇచ్చే కరణ్ జోహార్.. ఈసారి షో ప్రారంభంలోనే ఇద్దరు సౌత్ స్టార్స్ ని తీసుకురావడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇప్పటి వరకు ప్రసారమైన ఎపిసోడ్స్ లో బాలీవుడ్ స్టార్స్ పై ఇద్దరు దక్షిణాది సెలబ్రిటీలు పూర్తిగా ఆధిపత్యం చెలాయించారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కరణ్ టాక్ షోలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి.. ముఖ్యంగా సెక్స్ - ఎఫైర్స్ వంటి అభ్యంతరకరమైన విషయాల గురించి.. కాంట్రావర్సీ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆడియన్స్ సైతం అలాంటి వాటి కోసమే ఈ కార్యక్రమం చూస్తుంటారు. ఇప్పుడు సమంత మరియు విజయ్ దేవరకొండల నుంచి కరణ్ అలాంటి అంశాలపైనే సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు.

సమంత ఎపిసోడ్ లో నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం గురించి.. డివోర్స్ తర్వాత లైఫ్ మరియు మళ్లీ ప్రేమలో పడతారా లేదా వంటి విషయాలపై ఎక్కువగా ఫోకస్ అయింది. ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో చెప్పని అంశాలపై స్టార్ హీరోయిన్ నోరు విప్పడం సంచలనంగా మారింది.

దీంతో సామ్ కు సంబంధించిన అంశాలే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలీవుడ్ మీడియా కూడా దానిపైనే దృష్టి పెట్టడంతో.. అక్షయ్ కుమార్ పూర్తిగా సైడ్ అయిపోయారు. 'ఊ అంటావా' పాటకు సామ్ తో కలిసి డ్యాన్స్ చేయడం మినహా అతను ఎక్కడా హైలైట్ అవ్వలేదని అంటున్నారు.

ఇకపోతే ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిన విజయ్ దేవరకొండ గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఏ ఈవెంట్ కు వెళ్లినా విపరీతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఈ క్రమంలో కరణ్ టాక్ షోలో అతను సెక్స్ గురించి నోరు విప్పడం అందరినీ షాక్ కు గురి చేసింది.

విజయ్'D రియల్ లైఫ్ లోనూ డిఫరెంట్ యాటిట్యూడ్ తో ఉంటారనే సంగతి తెలిసిందే. ఎలాంటి విషయం మీదైనా డేర్ గా బోల్డ్ గా ఆన్సర్ చెప్పేస్తుంటాడు. కాఫీ విత్ కరణ్ షోలో అతను చాలా జాగ్రత్తగా నిజాయితీగా చెప్పిన సమాధానాలు అందరి దృష్టిని ఆకర్షించించాయి. ఇప్పుడు నెట్టింట వీడీ వీడియోలే వైరల్ అవుతున్నాయి.

అలానే సారా - జాన్వీ ఎపిసోడ్ లో ఎన్నో విషయాల గురించి చర్చించినా.. విజయ్ తో డేటింగ్ టాపిక్ మాత్రమే హైలైట్ అయ్యింది. ఈ విధంగా ఇప్పటి వరకు వచ్చిన నాలుగు ఎపిసోడ్స్ ఫీడ్ బ్యాక్ ను బట్టి చూస్తే నార్త్ సెలబ్రెటీలపై ఇద్దరు దక్షిణాది సినీ ప్రముఖులు పూర్తిగా ఆధిపత్యం చెలాయించారని చెప్పాలి.

కరణ్ షో నుంచి ఆడియన్స్ ఎలాంటివి ఎక్సపెక్ట్ చేస్తారో విజయ్ దేవరకొండ - సమంత అలాంటి స్టఫ్ ఇచ్చారని అర్థం అవుతోంది. అందులోనూ ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ బాలీవుడ్ లో సత్తా చాటుతున్న నేపథ్యంలో.. వారి గురించి తెలుసుకోడానికి నార్త్ ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే బీటౌన్ లో ఇద్దరు సౌత్ స్టార్స్ హాట్ టాపిక్ గా మారారు. మరి KWK రాబోయే ఎపిసోడ్స్ లో ఎవరి డామినేషన్ ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News