పాటలో దమ్ముంటే శ్రోతలు ఎన్నిసార్లు అయినా వినేందుకు ఆసక్తిగా ఉంటారు. మ్యాటర్ లేకపోతే ఒక్కసారైనా వినేందుకు భయపడతారు. ఇటీవలి కాలంలో తెలుగు సినిమా సాహిత్యం సంతకెళ్లిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంగీత దర్శకులే పాటలు రాసేయడం లేదా నైపుణ్యం తక్కువగా ఉన్నవాళ్లు రాసేస్తుండడంతో అవి కాస్తా వచనానికి తక్కువ.. కపిత్వానికి ఎక్కువగా దాపురించాయి.
అయితే దానికి అతీతంగా సాహితీ వేత్త నుంచి లిరిక్ బయటికి వస్తే ఎలా ఉంటుందో సామజవరగమన నిరూపిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న `అల వైకుంఠపురములో`ని తొలి పాట `సామజవరగమన` విడుదల అయిన 24 గంటల్లో 60 లక్షల (6 మిలియన్) వ్యూస్ ని... 3 లక్షలకు పైగా లైక్స్ ని దక్కించుకుంది. ఇప్పటికే కోటి వ్యూస్ ఖాతాలో వేసుకుంది. అలాగే ఈ పాట తొలి 35 నిమిషాల్లో 50 వేల లైక్స్.. 88 నిమిషాలకు 1 లక్ష లైక్స్.. మూడు గంటల 7 నిమిషాలకు 1లక్ష 50 వేల లైక్స్.. 6 గంటల 12 ని.లకు 2 లక్షల లైక్స్.. 10 గంటల 22 నిమిషాలకు 2 లక్షల 50 వేల లైక్స్... 22 గంటల 5 నిమిషాలకు 3 లక్షల లైక్స్ దక్కాయి.
ఇటీవల ఇంత దూకుడు ప్రదర్శించిన లిరికల్ వీడియో వేరొకటి లేదనే చెప్పాలి. ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ బ్యాండ్ బాగానే వర్కవుటైంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం పదును ఏ రేంజులో ఉంటుందో తాజా ఆదరణను బట్టి మరోసారి ప్రూవైంది. వేటూరి మరణం తర్వాత సాహితీ పరిభాష పూర్తి స్థాయిలో అందించే కొద్ది మంది రచయితల్లో సిరివెన్నెల అగ్రగణ్యుడు. భాస్కర భట్ల- అనంత శ్రీరామ్- రామజోగయ్య శాస్త్రి- సుద్ధాల అశోక్ తేజ- గోరేటి వెంకన్న ఇలా కొద్దిమంది సాహిత్యానికి విశేష ఆదరణ ఉంది.