ఇతరులు చేస్తున్నది నీవు చేయాల్సిన అవసరం లేదు

Update: 2021-11-13 08:35 GMT
స్టార్‌ హీరోయిన్ సమంత సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ఏదో ఒక పోస్ట్‌ లేదా ఫొటో షూట్స్ ను షేర్‌ చేస్తూనే ఉంటుంది. ఈ అమ్మడు చైతూ నుండి విడిపోతున్నట్లుగా ప్రకటించినప్పటి నుండి కూడా నెటిజన్స్‌ ఆమె ప్రతి పోస్ట్‌ ను.. ఆమె ప్రతి అడుగును ఒకటికి రెండు సార్లు అన్నట్లుగా బూతద్దం పెట్టి పరిశీలిస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా ఏదో గూడార్థం వెదికే ప్రయత్నం చేస్తున్నారు.

ఇటీవల కొన్ని సూక్తులు మరియు మంచి మాటలను సమంత షేర్‌ చేస్తూ వస్తుంది. అమ్మ మాట అంటూ కొన్ని సార్లు.. నా ఫీలింగ్ అంటూ మరి కొన్ని సార్లు ఆమె సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేస్తూ వస్తున్నారు. అయితే వాటికి వేరు వేరు అర్థాలను వెదుక్కుంటూ ఆమె అభిమానులు మరియు నెటిజన్స్ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఊహించేసుకుంటున్నారు.

తాజాగా సమంత సద్గురు సూక్తిని షేర్ చేశారు. అందులో ఇతరులు చేస్తున్నది నీవు చేయాల్సిన అవసరం లేదు. నీ లైఫ్‌ కు ఏది అయితే మంచి అనుకుంటున్నావో అదే నీవు చేయాలంటూ అందులో పేర్కొన్నారు. సద్గురు చాలా మంచి ఉద్దేశ్యంతో ఆ మాట చెప్పారు.

నలుగురితో పాటు నారాయణ అని కాకుండా నీ కంటూ ప్రత్యేకత ఉండేలా నీ పనులు ఉండాలి అనేది ఆ సూక్తి అర్థం. సమంత ఆ విషయాన్ని షేర్‌ చేస్తే ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కామెంట్స్ చేస్తున్నారు. సమంత విషయంలో కొందరు అత్యుత్సాహం చూపిస్తూ చేస్తున్న అతిని కొందరు తప్పుబడుతున్నారు. మొత్తానికి సమంత విషయంలో మళ్లీ కొందరు నెటిజన్స్‌ ఇష్టానుసారంగా కామెంట్స్ చేయడానికి పాయింట్ దొరికింది అన్నట్లుగా అభిప్రాయంతో తోచింది అనేస్తున్నారు.

నచ్చిన పని చేయాలి.. మనకు కావాల్సింది చేయాలంటూ సమంత షేర్‌ చేయడంతో అది కాస్త వైరల్‌ అయ్యింది. ఆమె ఎలాంటి పోస్ట్‌ లు పెట్టినా కూడా వైరల్‌ అవుతూనే ఉంది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే శాకుంతలం సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ కు సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక తమిళంలో కూడా ఒక సినిమాను చేస్తోంది.

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాలో నయనతార మరియు విజయ్ సేతుపతిలు నటిస్తున్నారు. మరో వైపు బాలీవుడ్‌ లో కూడా ఒక సినిమాను ఈ అమ్మడు చేయబోతుందట. ఇటీవలే ఆ ప్రాజెక్ట్‌ కు సంబంధించిన హింట్ ఇచ్చారు. వచ్చే ఏడాది సమంత ను కొత్తగా చూస్తామని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. వరుస సినిమాలతో ఆమె ఫుల్‌ బిజీ అయ్యే అవకాశం ఉందంటున్నారు.


Tags:    

Similar News