ఏదైనా జరిగిందన్నంతనే వెంటనే రియాక్టు కావటం మంచిదే. కాకుంటే.. మన చుట్టూ ఉన్న చాలా ఇష్యూల గురించి మాట్లాడే ధైర్యం చేయరు కానీ.. ప్రపంచ అంశాల గురించి మాట్లాడేందుకు మాత్రం తెగ ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు కొందరు సెలబ్రిటీలు. ఉక్రెయిన్ - రష్యాల మధ్య నడుస్తున్నయుద్ధం గురించి కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. పోస్టులు పెడుతున్నారు. అయితే.. తమకు సంబంధం లేని విషయాల మీద.. అవగాహన తక్కువ ఉన్న అంశాల మీద స్పందించే వేళ.. ఆయా ఇష్యూల గురించి అవగాహన పెంచుకోవటం అవసరం. అన్నింటికి మించి.. సెలబ్రిటీల హోదాలో ఉన్నవారు పరిమిత సమాచారంతో.. తమకేదో తెలిసినట్లుగా స్పందించటం అంత మంచి వ్యవహారం కాదు.
మనకు ఏ మాత్రం సంబంధం లేని రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టు సందేశాలను పెట్టటానికి ముందు.. సదరు దేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు.. వివాదానికి పూర్వాపరాలతో పాటు.. ఆయా దేశాలతో మనకున్న సంబంధాల గురించి సమాచారం తెలుసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. సామాన్యుల మాదిరి కాదు సెలబ్రిటీలు. వారు పెట్టే పోస్టులకు ఉండే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు.. ఆయా సెలబ్రిటీలు సందేశాల్ని ఇవ్వటానికి ముందు సదరు ఇష్యూకు సంబంధించిన పూర్తి వివరాల్ని సేకరించిన తర్వాత పోస్టు పెడితే బాగుంటుంది.
ఉక్రెయిన్ - రష్యా మధ్య నడుస్తున్న వార్ మీద ప్రముఖ సినీ నటి సమంత స్పందించారు. వార్ మీద ఆమె సోషల్ మీడియా వాల్ మీద తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆమె పోస్టును చూసినప్పుడు ఉక్రెయిన్ కు సానుకూలంగా.. రస్యాకు ప్రతికూలంగా ఆమె పోస్టు ఉందని చెప్పాలి. పోస్టు పెట్టటం తప్పు కాదు. కానీ.. అవగాహనా రాహిత్యంతో.. రెండు దేశాలతో మన దేశానికి ఉన్న సంబంధం.. అనుబంధం గురించి తెలుసుకొన్న తర్వాత పోస్టు పెడితే బాగుండేది. అదేమీ లేకుండా.. తమకు తోచింది తోచినట్లు పెట్టేయటం వల్ల అనవసరమైన గందరగోళం చేసుకోవటం ఖాయం.
ఉక్రెయిన్ లోని ఒక ఆసుపత్రి ఐసీయూ నుంచి అప్పుడే పుట్టిన శిశువును బాంబ్ షెల్టర్ లోకి తీసుకెళుతున్న వీడియోను సమంత తన పోస్టుతో షేర్ చేశారు. ఉక్రెయిన్ పరిస్థితి మీద అయ్యో పాపం అన్న భావనను తెలియజేశారు. మరి.. ఉక్రెయిన్ కు అనుకూలంగా ఓటు వేయటం లేదని.. మనవాళ్లపై ఉక్రెయిన్ సైనికులు దాడికి పాల్పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వేళ.. సమంత స్పందన ఏమిటి? అందుకే.. తొందరపడి అంతర్జాతీయ అంశాలపై స్పందించే వేళలో ఆచితూచి అన్నట్లు ఉండాలి.
అక్కడెక్కడో ఉక్రెయిన్ - రష్యా మధ్య నడుస్తున్న యుద్ధం గురించి లెక్చర్లు ఇవ్వటం.. తమకున్న మిడిమిడి జ్ఞానంతో తీర్పులు ఇచ్చేసే సెలబ్రిటీలు.. ముందుగా ఏపీలోని టికెట్ల ధరల ఇష్యూ మీద మాట్లాడే ధైర్యం చేయరెందుకు? తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి.. తమకు ఇంత పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చి పెట్టిన ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. దానికి కారణమైన అంశాల్ని కడిగిపారేసేలా పోస్టులు పెట్టే ధైర్యం చేయరెందుకు?
ఇప్పటికైనా.. జరుగుతున్న యుద్ధం గురించి తెలుసుకుంటూ.. దాని నేపథ్యం గురించి అవగాహన పెంచుకోవటంతో పాటు.. మన దేశానికి ఆ రెండు దేశాలతో ఉన్న అనుబంధం.. మనకు కష్టం వచ్చినప్పుడు ఆ రెండు దేశాల్లో ఎవరి పక్షాన నిలబడాలో డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది. అంతేకానీ.. సోషల్ మీడియాలో ఫార్వర్డ్ అయిన మెసేజ్ లను పోస్టులు చేయటం దుర్మార్గమే అవుతుంది. ఎందుకంటే.. అందులో పేర్కొనేవన్ని అర్థసత్యాలే కాబట్టి.