పవన్ లా ఉండడం సాధ్యం కాదు -సమంత

Update: 2016-01-31 09:30 GMT
మాకు హీరోతో సమానమైన రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదు.. మాకు తగిన గుర్తింపు లభించడం లేదు.. మమ్మల్ని చూపించినా వంద కోట్లు వస్తాయి.. హీరోలకిచ్చిన దాంట్లో పదో వంతు కూడా మాకు రావడం లేదు.. ఇలా ఉంటాయి హీరోయిన్ల కామెంట్స్. కానీ సౌత్ బ్యూటీ సమంత మాత్రం.. తన విజయ రహస్యం హీరోలే అంటోంది. ఓ సినిమా హిట్ అవడంలో హీరోయిన్ పాత్ర ఎంత ముఖ్యమో.. హీరోయిన్ కెరీర్ సక్సెస్ అవడంలో.. హీరోల పాత్ర కూడా అంతే ముఖ్యమని చెప్పింది శామ్స్. అసలు తను ఈ స్థాయిలో ఉండడానికి కారణం కొంతమంది హీరోలే అని తేల్చేసింది ఈ అమ్మడు.

తను పని చేసిన హీరోల మనస్తత్వాన్ని పంచుకునే ప్రయత్నం చేసింది ఈ భామ. పవన్ మాటలు చాలా లోతుగా ఉంటాయని, అంత స్టార్ డమ్ వచ్చాక అంత సింపుల్ గా ఉండడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పింది సమంత. మహేష్ బాబు చాలా సరదాగా ఉంటాడని, అంత జోవియల్ ఉండేవాళ్లని అసలు తాను చూళ్లేదని చెప్పింది ఈ బ్యూటీ.

ట్యాలెంట్ అంతా ఒక మూట కడితే ఎన్టీఆర్ లా ఉంటుందట. నాగ్ తో తనది సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పిన సమంత.. నాగార్జున తనను అమ్మా అని పిలుస్తుంటే ఉద్వేగంగా ఉంటుందని చెప్పింది. ఇక బన్నీ డ్యాన్సులు చేస్తుంటే.. చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుందట. తన కారణంగా ఎవరూ ఇబ్బంది పడకూడదని భావించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి సూర్య అని చెప్పిన శామ్స్.. తన విజయంలో వీళ్లందరి పాత్ర ఎక్కువ అని చెప్పడం విశేషం.
Tags:    

Similar News