న‌య‌న్ తో ఏ గొడ‌వ‌ల్లేవ్.. ఇదిగో ప్రూఫ్‌!

Update: 2020-12-11 04:48 GMT
ఏదైనా సినిమాలో ఇద్ద‌రు భామ‌లు న‌టిస్తున్నారు అంటే ఆ ఇద్ద‌రికీ మ‌ధ్య ఈగో స‌మ‌స్య‌ల‌పై స‌ర్వత్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుంటుంది. అదే కోవ‌లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలోని `కాతువాకుల రేండు కాదల్` పైనా ఇటీవ‌ల చ‌ర్చ సాగింది. ఈ చిత్రం చాలా కాలం క్రితం ప్రారంభ‌మైనా అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది. అందుకు కార‌ణం ఇందులో క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న న‌య‌న‌తార .. స‌మంత మ‌ధ్య ఈగో స‌మ‌స్య‌లేన‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది.

న‌య‌న్ పాత్ర‌కు ఉన్నంత స్కోప్ సామ్ పాత్ర‌కు లేక‌పోవ‌డంతో అలిగిన స‌మంత ఇందులో న‌టించ‌డం లేద‌ని కూడా ప్రచార‌మైపోయింది. అయితే ఇవేవీ నిజాలు కావ‌ని నిరూపిస్తూ తాజాగా స‌మంత రామోజీ ఫిలింసిటీలో చిత్రీక‌ర‌ణ‌కు హాజ‌రుకానున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. షూట్ తేదీలు ఖ‌రార‌య్యాయి. సమంత ఈ నెల 14 నుండి హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో చిత్రీక‌ర‌ణ‌లో చేరనున్నారు. ఇందులో సేతుప‌తి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సెట్స్ లో జాయిన‌య్యేందుకు సామ్ సిద్ధ‌మ‌వుతున్నారు కాబ‌ట్టి న‌య‌న్ తో ఈగో స‌మ‌స్య ఏదీ లేద‌ని తేలిపోయ‌న‌ట్టే.

శర్వానంద్ స‌ర‌స‌న‌ ‘జాను’లో న‌టించిన‌ త‌ర్వాత‌ సమంత ఇప్పటి వరకు వేరొక సినిమాలో న‌టించిందేమీ లేదు. ఇన్నాళ్లుగా కెమెరాను ఎదుర్కోలేదు. అయితే గత కొన్ని వారాలుగా సామ్ తన టాక్ షో సామ్ జామ్ కోసం చురుకుగా షూటింగ్ చేస్తున్నారు. త‌దుప‌రి ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 రిలీజ్ ప్ర‌చారానికి సామ్ సిద్ధం కావాల్సి ఉంటుంద‌ట‌.
Tags:    

Similar News