సెలబ్రిటీల పెళ్లిళ్లు.. బ్రేకప్ లు.. విడాకులు ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి. అయితే.. విడాకులు తీసుకున్న తర్వాత సెలబ్రిటీ స్టేటస్ దక్కించుకున్న వ్యక్తి సంపత్ రాజ్. తెలుగులో పంజా సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన సంపత్.. ఆ తర్వాత దమ్ము.. మిర్చిలతో బోలెడంత డిమాండ్ ఉన్న విలన్ గా.. కేరక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగాడు. అయితే.. అంతకు 8-9 ఏళ్ల క్రితం నుంచే తమిళ్ లో తెగ బిజీగా ఉన్న సంపత్.. విడాకుల గురించి బోలెడన్ని కబుర్లు చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచాడు.
బహుశా తను నటుడు అవడం కోసమే అప్పుడు విడాకులు తీసుకుని ఉంటానని.. అంతా విధి రాత అని చెప్పాడు సంపత్. ఇప్పటికీ తన మాజీ భార్యకు ఇదే విషయంలో థ్యాంక్స్ కూడా చెబుతూ ఉంటానన్నాడు. అయితే.. విడాకులు తీసుకోవాల్సి వచ్చిన కారణం కూడా చెప్పాడు సంపత్. 'మాకు చాలా యంగేజ్ లో పెళ్లయింది. అప్పుడు నాకు 23.. తనకు 19 ఏళ్ల వయసంతే. పెద్దలు కుదిర్చిన సంబంధమే అయినా ఆ వయసులో పెళ్లి చేసుకుంటే.. 27-28 ఏళ్ల వయసు వచ్చేసరికి మన దారులు వేరనే విషయం అర్ధమవుతుంది. అప్పుడు విడాకులు తీసుకోవాలని ఇద్దరం కలిసి నిర్ణయించుకున్నాం. ఒకవేళ తీసుకోకపోతే ఏదో ఒక రోజు తను నన్ను చంపడమో.. లేకపోతే నేను తనను చంపడమో జరిగేదేమో' అన్నాడు సంపత్.
ఇప్పటికీ తన అమ్మ.. తన భార్య తరచుగా కలుస్తూ ఉంటారని.. ఆమెకు తనకు చేతనైంత సపోర్ట్ ఇస్తూ ఉంటానని చెప్పాడీ సూపర్ ట్యాలెంటెడ్ కేరక్టర్ ఆర్టిస్ట్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/