ఆ బూతులు తీసేస్తే అర్జున్ రెడ్డికి కష్టమే

Update: 2017-09-06 00:30 GMT
ధియేటర్లలో 'అర్జున్ రెడ్డి' ప్రభంజనం అంటూ రోజూ ఏదో ఒకటి చదువుతూనే ఉంటాం. ఎందుకంటే సినిమాలో ఉన్న ఇంటెన్స్ కంటెంట్ జనాలకు బాగానే ఎక్కేసింది. అందుకే మూకుమ్మడిగా సినిమాను చూసేస్తున్నారు యూత్. కాబట్టి కలక్షన్లకు పెద్దగా ఢోకా లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ఒక ఏరియాలో మాత్రం కష్టం వచ్చి పడింది తెలుసా.

నిజానికి తొలిరోజు నుండే హవా సాగిస్తున్న సినిమా ఏదైనా కూడా ఈపాటికే టివిల్లో వచ్చేయడానికి శాటిలైట్ రైట్స్ అమ్మేసుకుంటాయ్. పైగా సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలను మన ఛానళ్ళు కూడా వదిలిపెట్టవ్. కాని ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' విషయంలో ఈ సినిమాకు వచ్చిన 'ఏ' సర్టిఫికేట్ ఏదైతే ఉందో.. దానితో పెద్ద చిక్కే వస్తోంది. ఎందుకంటే టివిల్లో వెయ్యాలంటే యు/ఎ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ అలా చేస్తే.. సినిమాల్లో ఉన్న ముద్దులూ ముచ్చట్లూ.. బూతులు బీభత్సాలూ ఎగిరిపోతాయ్. అప్పుడు ఇంకా సినిమాను ఎవరు చూసి ఆస్వాదిస్తారు?

పైగా అవన్నీ తీసేస్తే మనం చూసిన అనేక గుంపులో గోవిందం ఫెయిల్యూర్ లవ్ స్టోరీల తరహాలోనే ఇది కూడా ఉంటుంది. అందుకే ఛానళ్లు సినిమాను కొనడానికి డేర్ చేయట్లేదు. మరి ధియేటర్ల కోసం 40 నిమిషాల నిడివిని పెంచడానికి రెడీ అయిపోతున్న అర్జున్ రెడ్డి టీమ్.. టివిల కోసం ఏదన్నా ప్లాన్ వేస్తారేమో చూడాలి.
Tags:    

Similar News