అంతన్నాదింతన్నాదే అన్నట్లే తయారైంది తమన్నా పరిస్థితి. ‘బాహుబలి: ది కంక్లూజన్’లో తనదీ కీలక పాత్రే అని విడుదలకు ముందు గొప్పగా చెప్పుకున్న తమన్నాపై ఇప్పుడు బోలెడన్ని జోకులు పేలుతున్నాయి. సినిమాలో ఆమెకు అసలేమాత్రం పాత్ర లేకపోవడం.. ఏదో నామమాత్రంగా ఒకట్రెండు షాట్లలో కనిపించడం తప్పితే కనీసం ఒక్క డైలాగ్ కూడా లేకపోయేసరికి సోషల్ మీడియాలో జనాలు తమ్మూపై సెటైర్లతో రెచ్చిపోతున్నారు.
రాజశేఖర్ హీరోగా నటించిన ఓ సినిమాలో ఏమ్మా మెరుపు తీగా ఒకసారి ఇలా వచ్చి పో అంటే.. రయ్యిన వచ్చి వెళ్లే అమ్మాయిలా తయారైంది తమన్నా పరిస్థితి అంటూ.. ఆమెను మెరుపు తీగగా అభివర్ణిస్తున్నారు జనాలు. అంతే కాక శివుడు నరికిన భద్ర (అడివి శేష్) తలకే సినిమాలో అంతో ఇంతో ప్రాధాన్యం ఉందని.. ఆ తలకు ఉన్నంత స్క్రీన్ టైం.. ప్రాధాన్యం కూడా తమన్నా పాత్రకు లేవని జనాలు సెటైర్లు వేస్తున్నారు.
ఈ మాత్రం దానికే అంతంత చెప్పుకున్నావ్ అంటూ తమన్నాను టార్గెట్ చేస్తున్నారు. తమన్నా పాత్రకు రెండో భాగంలో అంత ప్రాధాన్యం ఉండదని రాజమౌళి ముందే చెప్పినప్పటికీ.. ఆమె పాత్రను మరీ ఇంత నామమాత్రంగా మార్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనమీద కాస్తయినా శ్రద్ధ పెట్టాల్సిందని.. కనీసం చివర్లో మహేంద్ర బాహుబలితో పెళ్లి జరిగినట్లయినా చూపించాల్సిందని జనాలు అభిప్రాయపడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/