ప్రభాస్ సలార్ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తమ హీరోని ఎలా చూపిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, మూవీ టీజర్ డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మూవీకి సంబంధించి ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది.
ఓ ముఖ్యమైన పవర్ ఫుల్ మహిళా పాత్రలో శ్రియా రెడ్డిని తీసుకున్నారంటూ వార్త వచ్చిన సంగతి తెలిసింది. ఆ వెంటనే మరో కీ రోల్ గురించి బయటకు వచ్చింది. ప్రముఖ శాండిల్ వుడ్ నటుడు సౌరవ్ లోకేష్ కూడా సలార్ మూవీలో భాగస్వామి కానున్నాడట. ఇతను కూడా సలార్ మూవీలో నెగిటివ్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.
శివరాజ్ కుమార్ నటించిన భజరంగీ సినిమాతో సౌరవ్ లోకేష్ బాగా ఫేమస్ అయ్యాడు. ఆ సినిమా తర్వాత నుంచి అందరూ అతనిని భజరంగీ లోకీ అని పిలుస్తూ వస్తున్నారు. కాగా, ఈ నటుడికి సలార్ లో తన విలనిజం చూపించే స్కోప్ ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే సలార్ లో చాలా మంది శాండిల్ వుడ్ నటులను తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా లోకి ని కూడా తీసుకోవడం విశేషం. ఇప్పటికే లోకేష్ ఈ సినిమా కోసం 45 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడట. మొన్నటి వరకు బెంగళూరు షూటింగ్ లో పాల్గొనగా, ఇప్పుడు హైదరాబాద్ లో పెండింగ్ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడట. లోకేష్ చివరగా చిరంజీవి ఆచార్యలో కనిపించడం విశేషం.
ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, విలన్ కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ ఆయన విలన్ కి కూడా ఇవ్వగలరు. అదే విధంగా ఆయన సినిమాలో మెయిన్ విలన్ ఒకరే ఉన్నా, మధ్యలో చాలా మంది విలన్స్ ఉంటారని కేజీఎఫ్ చూసినవారికి అర్థమయ్యే ఉంటుంది. ఈ క్రమంలో సలార్ లో కూడా అలా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు నెగిటివ్ రోల్ లో చాలా మంది పేర్లు వినిపించాయి. మరి లోకేష్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా ద్వారా లోకేష్ పాత్ర క్లిక్ అయితే, ఆయనకు మళ్లీ తెలుగులో మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, ప్రశాంత్ నీల్ కి ఇది తెలుగు తొలి చిత్రం కావడంతో ఈ మూవీపై ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సాలార్‌లో శృతి హాసన్ కథానాయిక కాగా, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.