అఖిల్ హీరోయిన్ వయస్సు 49 తెలుసా

Update: 2016-10-24 15:30 GMT
అఖిల్ హీరోయిన్ వయస్సు 49 తెలుసా
అక్కినేని అఖిల్ తో కలిసి జాయింట్ గా టాలీవుడ్ అరంగేట్రం చేసిన భామ సాయేషా సైగల్ కి.. ఆ మూవీ ఫెయిల్యూర్ తర్వాత తెలుగులో ఆఫర్లు క్యూ కట్టలేదు. కానీ బాలీవుడ్ మూవీ శివాయ్ లో అజయ్ దేవగన్ సరసన ఆఫర్ దక్కించుకుంది. అయితే ఈ ఆఫర్ ఆమెకు అఖిత్ తర్వాత వచ్చినది కాదు. అంతకు ముందే ఈ ఆఫర్ దక్కించుకుందీ 19 ఏళ్ల భామ.

ఒకసారి అజయ్ దేవగన్ కు సాయేషా కుటుంబ సభ్యులు ఈమె ఫోటోలు చూపిస్తే.. ఆడిషన్ కు పిలిచారట. కొన్ని రోజుల తర్వాత ఆఫర్ ఇస్తున్నట్లు చెప్పారట. సరిగ్గా 17వ పుట్టినరోజునే ఈ సంగతి తెలిసిందని చెబుతోంది సాయేషా. మరి ఇండస్ట్రీలోను.. ఏజ్ లోను బాగా సీనియర్ అయిన అజయ్ దేవగన్ తో టీనేజ్ వయసులో ఉన్న ఈమెకు రొమాన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించి ఉంటుంది కదా అనే ప్రశ్న ఎదురైంది.

'వయసు ఎప్పుడూ సమస్య కాదు. ఆలోచనల ప్రకారం ఆయన నాకంటే చాలా యంగ్. నేను మెంటల్ గా 49 ఏళ్ల వయసులో ఉంటే అజయ్ దేవగన్ కు 25ఏళ్లే. ఏజ్ సమస్య చూపించి సీనియర్ తో నటించే అవకాశం పోగొట్టుకోలేను. ఏజ్ గ్యాప్ సమస్య ఉంటుంది. కానీ తనకంటే 30 ఏళ్ల వయసున్న అమ్మాయితో రొమాన్స్ చేసేందుకు ఆయన కూడా ఇబ్బంది పడే ఉంటారు కదా' అంటోంది సాయేషా. రెండు సినిమా అనుభవానికే ఈమెకు చాలా తెలివితేటలు అబ్బేసినట్లున్నాయ్ కదూ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News