సాయేషా.. స్పైస్ లేకపోతే ఎలా?

Update: 2015-11-10 16:12 GMT
తెల్లారితే థియేటర్లలో సందడి చేయబోతున్న అఖిల్ కోసం హంగామా మామూలుగా లేదు. తెలుగురాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అఖిల్ సందడి పెరిగిపోతోంది. ప్రమోషన్స్ అయితే పీక్స్ లోకి వెళ్లిపోయాయి. ఈ సమయంలో అఖిల్ పక్కన చిందేసిన భామ సాయేషా సైగల్ కూడా వీలైనంతవరకూ తన వంతు ప్రచారం చేస్తోంది.

ఈవెంట్లు - ఫంక్షన్లు - ప్రెస్ మీట్లకు హాజరవడం ద్వారా ప్రేక్షకుల కంట్లో పడేందుకు ప్రయత్నిస్తోంది. అయితే.. ఈ కార్యక్రమాల్లో సాయేషా డ్రస్ సెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. చక్కగా పంజాబీ డ్రెస్ వేసుకునో, సాంప్రదాయంగా నిండైన దుస్తుల్లోనో దర్శనమిస్తోందీ చక్కని చిన్నది.  పాత తరం నటి షహీన్ అహ్మద్ కూతురు కావడం, దిలీప్‌ కుమార్‌-సైరా భానూ మనవరాలు కావడంతో.. ఇలా నిండుగా డ్రస్సులు వేసుకుని కనిపిస్తోంది అనుకోవచ్చు.

అయితే.. చాలామంది యంగ్ హీరోయిన్స్ ఇలా స్టార్ ల వారసులే. వాళ్లందరూ గ్లామర్ కి కొత్త గ్రామర్ నేర్పిస్తామంటున్నారు. ఈమె మరీ వెనుకటితరం వాసనలతో కాస్త డీగ్లామర్ అనిపిస్తోంది ఈ డ్రస్సుల్లో. మరీ ఇంత సాంప్రదాయం ఎలా సాయేషే.. కాస్త స్పైస్ కూడా జోడించాలి కదా ఈ జనరేషన్ హీరోయిన్ అంటే.. కొంచెం థింక్ చెయ్.
Tags:    

Similar News