బాలీవుడ్ భామలు తెలుగు మాట్లాడితే భలేగా ఉంటుంది. మిగతా సమయంలో ఏం నేర్చుకుంటారో.. ఎంత మాట్లాడతారో చెప్పలేం. కానీ.. ఆడియో ఫంక్షన్ లలో - ప్రమోషన్ ఈవెంట్లలో తాము నేర్చుకున్న ఓ రెండు ముక్కలు మాట్లాడేసి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారీ ముద్దుగుమ్మలు. అఖిల్ భామ సాయేషా సైగల్ కూడా ఇదే రూట్లో ఉంది. ఈ సినిమా చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి అంటూ తెలుగులో మొదలుపెట్టి.. మళ్లీ ఇంగ్లీష్ లోకి వెళ్లి, మధ్యమధ్యలో తెలుగు పలుకులు పలుకుతూ.. ఇంటర్వ్యూ పూర్తి చేసింది సాయేషా సైగల్.
-తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉంది ?
తెలుగులో చాలా కంఫర్టబుల్ గా ఉంది. నా తర్వాతి ఇంటర్వ్యూని పూర్తిగా తెలుగులోనే పూర్తి చేస్తాను. డైలాగ్స్ చెప్పడంలో ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు.
-తెలుగు సినిమాతో సినీరంగ ప్రవేశంపై ఏమనుకుంటున్నారు ?
తెలుగు మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. ఇక్కడ పని చేయడం హ్యాపీ. వినాయక్ గారు చెప్పినపుడే ఇది పెద్ద ప్రాజెక్ట్ అని అర్ధమైంది. అఖిల్ చాలా డెడికేటివ్. చాలా హార్డ్ వర్క్ చేశాడు.
-ఈ మూవీలోకి ఎలా ఎంపికయ్యారు ?
నితిన్ - సుధాకర్ రెడ్డి గారు వచ్చి మా పేరెంట్స్ ని అడిగారు. వినగానే నాకు కూడా నచ్చింది.
-అఖిల్ లో ఏ పాట మీకు నచ్చింది ?
ఈ మూవీలో అన్నిపాటలు సూపర్ గా వచ్చాయి. ముఖ్యంగా అక్కినేని, అక్కినేని సాంగ్ చాలా బాగుంటుంది. ఈ పాటలో డ్యాన్స్ మూమెంట్స్ బావుంటాయి.
సింగర్ గా మారతారా ?
ముందు యాక్టింగ్ కెరీర్ సెట్ చేసుకున్నాక ఆలోచిస్తా. ప్రేక్షకులు నన్ను యాక్టర్ గా ఆశీర్వదించనివ్వండి
సినిమా ఎలా ఉంది ?
నేను ప్రేక్షకులతోనే చూద్దామని అనుకుంటున్నాను. అందుకే పుల్ మూవీ ఇంకా చూడలేదు.
నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి ?
తెలుగులో కొన్ని స్టోరీస్ వింటున్నాను. ప్రస్తుతం అజయ్ దేవగన్ తో కలిసి శివాయ్ లో నటిస్తున్నాను.
తెలుగులో నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంది. మంచి ప్రాజెక్ట్స్ వస్తే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగుకే అంటూ ఇంటర్వ్యూ ముగించింది అఖిల్ హీరోయిన్ సాయేషా సైగల్.