హైదరాబాద్ ఓ సినిమా హబ్. ఇక్కడ అన్ని భాషలకు సంబంధించిన సినిమాలకు ఆదరణ ఉంది. అంతేకాదు .. సినిమా పరిశ్రమకు అత్యంత అనుకూలమైన నగరం ఇది. అందుకే వరుసగా నాలుగోసారి ఆస్కార్ ఎంపికలకు హైదరాబాద్ ని ఎంచుకుంది జ్యూరీ కమిటీ. ఈసారి ఇండియా నుంచి ఆస్కార్ బరిలోకి వెళ్లే సినిమాని ఎంపిక చేసేది ఇక్కడే. ఇప్పటికే తెలుగు ఫిలింఛాంబర్ నుంచి అన్నిరకాలా సాయం అందుతోంది.
2016కి ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీకి వెళ్లే సినిమా ఏది? 2015లో రిలీజైన ఏ సినిమాకి ఆ అర్హత ఉంది అన్నది నిర్ణయించడానికి ప్రస్తుతం ఫిలింఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ ఎఫ్ ఐ) కమిటీ కసరత్తులు చేస్తోందని ఎఫ్ ఎఫ్ ఐ అధ్యక్షుడు అమోల్ పాలేకర్ తెలిపారు. దాదాపు 45 సినిమాల నుంచి ఒక సినిమాని ఫైనల్ చేసి సెప్టెంబర్ 25న ఎంపికైన సినిమా వివరాలు ప్రకటిస్తామన్నారు.
అయితే బాలీవుడ్ నుంచి లాబీయింగ్ పెనుసవాల్ గా మారింది. విశాల్ భరద్వాజ్ 'హైదర్', రాజ్ కుమార్ హీరాణీ 'పీకే', ఒమంగ్ కుమార్ 'మేరీకోమ్', అనురాగ్ కశ్యప్ 'ఉంగ్లీ' చిత్రాల్ని ఆస్కార్ ఎంట్రీలో ఉన్నాయి. ముంబైలో లాబీయింగ్ ఎక్కువగా ఉండడం వల్లే హైదరాబాద్ ను ఈ ఎంపికలకు సెలక్ట్ చేసుకున్నారని తెలుస్తోంది.