డ్రగ్స్ తీసుకున్న కంగనాను ఎందుకు పిలవలేదు?: ఎన్‌సీబీపై సీనియర్ హీరోయిన్ ఫైర్

Update: 2020-09-24 10:50 GMT
బాలీవుడ్ లో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) పలువురు బాలీవుడ్ హీరోయిన్లకు సమన్లు పంపించిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే - సారా అలీఖాన్ - శ్రద్ధా కపూర్ - రకుల్ ప్రీత్ సింగ్‌‌ లను మూడు రోజుల్లోగా తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఎన్‌సీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ నేత నగ్మా డ్రగ్స్ ఇష్యూపై స్పందిస్తూ ఈ కేసులో ఎన్‌సీబీ వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టింది. డ్రగ్స్ తీసుకున్నట్టు గతంలో స్వయంగా వెల్లడించిన కంగనా రనౌత్‌ కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎందుకు సమన్లు పంపించలేదని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.

నగ్మా ట్వీట్ చేస్తూ ''డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్న కంగనా రనౌత్‌ ను ఎన్‌సీబీ ఎందుకు పిలవలేదు. వాట్సాప్ ఛాట్ ఆధారంగానే ఇతర నటీమణులను పిలవగలిగితే.. మరి స్వయంగా వెల్లడించిన కంగనను ఎందుకు పిలవలేదు? అయినా టాప్ హీరోయిన్స్‌‌ కు సంబంధించిన సమాచారాన్ని ప్రెస్ కు లీక్ చేసి వారిని అపఖ్యాతిపాలు చేయడమే ఎన్‌సీబీ డ్యూటీనా'' అని ప్రశ్నించారు. అంతేకాకుండా దీనికి కొన్ని ఫోటోలు జత చేసి చేసింది నగ్మా. వాటిలో అనురాగ్‌ కశ్యప్‌ - దీపికా పదుకొణె - దియా మీర్జా వీళ్లంతా కూడా గతంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టే వాళ్లను ఈ విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. స్వర భాస్కర్ - రిచా చద్దా - అనుభవ్ సిన్హా లు కూడా లైన్లో ఉన్నారని ఆ ఫోటోలలో పేర్కొన్నారు.

కాగా, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తాను కూడా డ్రగ్స్ కి బానిస అయినట్టుగా చెప్పిన ఓ పాత వీడియో ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. మార్చి నెలలో కంగనా తన స్వస్థలమైన మనాలిలో ఉన్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో కంగనా మాట్లాడుతూ.. 'నటిని కావాలన్న ఉద్దేశంతో ఇంటినుంచి పారిపోయి ముంబైకి వచ్చాను. కొన్నేళ్ల తర్వాత హీరోయిన్ అయ్యాను. అంతేకాకుండా డ్రగ్స్‌ కి బానిసయ్యాను. నేను యుక్తవయసులో ఉన్నప్పుడు ఇది జరిగింది. నేను చాలా మంది వ్యక్తులతో ఇబ్బంది పడ్డాను అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ నగ్మా ఎన్‌సీబీ ని ప్రశ్నించింది.
Tags:    

Similar News