బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణాలేంటనేదే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన అంశం. ఇప్పుడు సుశాంత్ మరణానికి డ్రగ్స్ కారణమంటూ కొత్త వాదన తెరపైకి వచ్చింది.
తాజాగా సుశాంత్ ప్రియురాలు రియాను విచారిస్తున్న సీబీఐ ఈ కేసులో పలువురు బాలీవుడ్ స్టార్ల పేర్లను రాబట్టినట్టు సమాచారం. సుశాంత్ మృతి కేసులో బాలీవుడ్ స్టార్ల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కోణం నుంచి దర్యాప్తుచేస్తున్న్ ఎన్.సీ.బీ ఇందులో రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరిండా, దీపేష్ సావంత్ లను ఇప్పటికే అరెస్ట్ చేసింది. సుశాంత్ ప్రియురాలు రియాను సోమవారం రెండోరోజూ విచారించింది. ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.
డ్రగ్స్ వ్యాపారి బాసిత్ పరిహార్ తనను కలిశాడని.. తమ ఇంటికి వచ్చేవాడని రియా తెలిపింది. డ్రగ్స్ తో సంబంధమున్న బాలీవుడ్ నటుల పేర్లనుసైతం ఎన్.సీ.బీకి రియా వెల్లడించిందని అంటున్నారు. ప్రస్తుతం 18 నుంచి 19మంది స్టార్ల పేర్లను ఎన్.సీ.బీ పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. అయితే వారు ఎవరనేది బయటకు రాలేదు.
సుశాంత్ 2016 నుంచి డ్రగ్స్ కు అలవాటు పడ్డాడని ఎన్.సీ.బీ విచారణలో తేలినట్టు సమాచారం. మరోవైపు సుశాంత్ మృతి కేసులో అరెస్ట్ అయిన డ్రగ్ పెడ్లర్ కైజెన్ ఇబ్రహీం డ్రగ్ డీలర్ అనూజ్ పేరును వెల్లడించారు. అనూజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనూజ్ నివాసంలో పెద్ద ఎత్తున డ్రగ్స్, విదేశీ కరెన్సీ దొరికింది.
ఇక సుశాంత్ కేసుపైనే దేశవ్యాప్తంగా మీడియా దృష్టిపెట్టడంపై పలువురు మండిపడుతున్నారు. రైతుల సమస్యలు, ఆర్థిక సంక్షోభం, కరోనా సహా అన్నీ సమస్యలున్నాయని.. వైఫల్యంపై దృష్టి మరల్చేందుకే కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సెటైర్లు వేశారు.
ఇక సుశాంత్ మరణం కేసులో శివసేన వర్సెస్ బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. శివసేన బెదిరింపులతో కంగనకు ‘వై ప్లస్’ కేటగిరి భద్రతను కేంద్రం కల్పించింది. మొత్తంగా సుశాంత్ మరణానికి సంబంధించిన కారణం కోసం శూలశోధన జరుగుతోంది.