పడగొట్టాలి అంటే నీ తరవాతే గురూ

Update: 2017-05-02 06:47 GMT
బాలీవుడ్  రొమాన్స్ కింగ్ షారుక్‌ తనతో కలిసి నటించిన నటీమణులుకు ఎంత గౌరవం ఇస్తాడో మొత్తం బాలీవుడ్ కి తెలుసు. షారుక్‌ ఇంత బాగా రొమాన్స్ చేయగలుగుతున్నాడు అంటే అందులో హీరోయిన్స్ మద్దతు ఉంది అనే కదా అర్ధం. అందుకే షారుక్‌ ఆ భామలను కూడా ఎక్కువగానే పొగుడుతూ ఉంటాడు.

మామూలు పడుచు పిల్లకే ఇన్‌ స్టాగ్రామ్‌ లో వస్తున్న ఫాలోయింగ్ గురించి చెప్పే పనిలేదు. ఇక కాస్త అందంగా ఉంటే టక్కునా లైక్ ఫాలో బటన్ నొక్కే మన యూత్.. బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇన్‌ స్టాగ్రామ్‌ లో అక్కౌంట్ ఓపెన్ చేస్తే ఏం చేస్తారు? కత్రినా కైఫ్‌ ఈ మధ్యనే ఇన్‌ స్టాగ్రామ్‌ లోకి రాగా.. వచ్చిన 24 గంటలలోనే అచ్చంగా పది లక్షల మంది ఫాలోవర్లని సొంతం చేసుకుంది. ఇకపోతే షారుక్‌ ఇన్‌ స్టాగ్రామ్‌, ట్విటర్ లో చాలా చురుకుగా ఉంటాడు. ఇప్పుడు తన ఫ్రెండ్  కత్రినా రావడంతో.. ఆమెతో కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. తన స్నేహితురాలైన కత్రినాకి స్వాగతం పలుకుతూ అందం ఇప్పుడు మరింత గొప్పగా మారబోతుంది అంటూ ఒక క్యాప్షన్‌ పెట్టాడు.

వీళ్ళుద్దరు కలిసి ‘జబ్‌ తక్‌ హై జాన్‌’ సినిమాలో నటించారు.​ ఇకపోతే ఈ పోస్ట్ ను చూసినవారు.. ఏదేమైనా పొగడ్తలతో పడగొట్టాలి అంటే అది నీ తరువాతే గురూ అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News