వెజ్‌ ఫుడ్‌ లేదని బాగా ఫీలయ్యాడు

Update: 2016-06-28 13:30 GMT
ఉడ్తా పంజాబ్ మూవీతో భారీ సక్సెస్ నే కాదు.. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేశాడన్న మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు షాహిద్ కపూర్. అయితే ఓ విషయంలో మాత్రం షాహిద్ తో సినిమాలు చేసే నిర్మాతలకు విసుగొస్తోంది. ఈ హీరోకి కూడా అదే విషయంలో ప్రతీ చోటా కస్సుబుస్సుమంటున్నాడు.

అసలు విషయం ఏంటంటే రాధా సోమికి పరమభక్తుడైన షాహిద్ కపూర్.. నాన్ వెజ్ ని నోట పెట్టడు. ఎక్కడికెళ్లినా వెజిటేరియన్ కోసమే వెతుక్కుంటాడు. షూటింగుల్లో కూడా ఈ హీరోకి శాకాహార వంటకాలు అందించే సరికి ప్రొడ్యూసర్ కి తలప్రాణం తోకకు వస్తోంది. రీసెంట్ గా స్పెయిన్ లో జరిగిన ఐఫా అవార్డుల ఫంక్షన్ కి హాజరైన షాహిద్.. తిరిగొచ్చేటప్పుడు ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కాడు. అందులో వెజిటేరియన్ కి సంబంధించి ఈ హీరోకి ఆప్షన్స్ కనిపించకపోవడంతో చిర్రెత్తుకొచ్చింది.

'విమానాల్లో శాకాహారులకు ఆప్షన్స్ లేకపోవడం చూసి విసుగొస్తోంది. మనం పాటిస్తున్న సిద్ధాంతాల్లోనే ఏదో సమస్య ఉందనుకుంటా. ఎమిరేట్స్.. బాగా నిరుత్సాహం కలిగింది' అంటూ ఆ ఎయిర్వేస్ సంస్థకు ట్విట్టర్ లో ఓ మెసేజ్ పోస్ట్ చేశాడు. దీనికి ఆ కంపెనీ నుంచి రియాక్షన్ రాలేదు కానీ.. మనోడి ఫ్రస్టేషన్ మాత్రం అందరికీ అర్ధమైంది. రంగూన్ సినిమా కోసం రీసెంట్ గా అరుణాచల్ ప్రదేశ్ కి షూటింగ్ కి వెళుతూ తనకు కావాల్సిన వంట సామాగ్రి అంతా 9 సూట్ కేసుల్లో తీసుకెళ్లాడు షాహిద్ కపూర్.

Tags:    

Similar News