గేమ్ ఎప్పుడూ ఒకరి చేతిలోనే ఉండదు. అది నిరంతరం మారుతూ ఉంటుంది. ఇప్పుడు నార్త్ పై సౌత్ గ్యాంబ్లింగ్ వర్కవుటవుతోంది. మార్కెట్లో మనోళ్ల గేమ్ ఇంట్రెస్టింగ్ గా నడుస్తోంది. ఇన్నాళ్లు జాతీయ భాష మాది అని జబ్బలు చరుకున్నవాళ్లు సైతం జాతీయ భాష మాదేనా? అని సందేహించే పరిస్థితి వచ్చింది. తమిళం ప్రాచీన భాష అని.. తెలుగు గొప్ప ఔన్నత్యం ఉన్న భాష అని తెలుగు ట్యాలెంట్ సూపర్భ్ అని బాంబే పరిశ్రమలో కీర్తిస్తున్నారు. అంతగా తెలుగు సినిమా మన ఖ్యాతిని పెంచింది. తెలుగోడికి తెలుగు సినిమానే గుర్తింపు అన్నంతగా టాలీవుడ్ ప్రభ ఇరుగు పొరుగున వెలిగిపోతోంది.
అయితే ఇప్పటికీ దీనిని అంగీకరించేందుకు ఖాన్ ల త్రయం కానీ యష్ రాజ్ లు కానీ కుమార్ లు కపూర్ లు రోషన్ లు ఖన్నాలు సిద్ధంగా లేరు. కానీ నిజమైన ప్రతిభావంతులు ఎందరో ఇప్పుడు తెలుగు సినిమాని కీర్తించేందుకు కూడా వెనకాడడం లేదు. మొన్నటికి మొన్న అధీరాగా నటించిన సంజయ్ దత్ కన్నడ సినిమా కేజీఎఫ్ 2 ని ఆకాశానికెత్తేశారు. ఈగో లేకుండా హీరోయిజం అవసరాన్ని వీళ్లను చూసి నేర్చుకోండి అంటూ బాలీవుడ్ కి పరోక్షంగా చురక వేసాడు.
ఇప్పుడు అనుపమ్ ఖేర్ సైతం ఒక తెలుగు దర్శకుడిని కీర్తించిన తీరు ప్రధానంగా చర్చకు వచ్చింది. బాలీవుడ్ లోని అత్యంత ప్రతిభావంతులైన నటులలో ఒకరైన అనుపమ్ ఖేర్ వాస్తవికతను వెతుకుతూ సరైన కారణాల కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తారు. ఆయనకు టాలీవుడ్ ప్రముఖులతో అనుబంధం ఎంతో గొప్పది. తాజాగా రాజమౌళితో తన సమావేశం గురించి వివరాలు అందించడానికి సీనియర్ నటుడు ఇన్ స్టా వేదికను ఎంచుకున్నారు. అతను ఇంటరాక్టివ్ సెషన్ నుండి కొన్ని ఫోటోగ్రాఫ్ లను పంచుకున్నాడు. అంతేకాదు.. ఒక స్వీట్ నోట్ ను కూడా రాశాడు.
''ఎంత అద్భుతమైన వ్యక్తి! గోవా ఫిలింఫెస్టివల్ లో ప్రఖ్యాత ఎస్.ఎస్.రాజమౌళి గారితో అద్భుతమైన సంభాషణ సాగించాను. ఉమ్మడి కుటుంబాలు.. చిన్ననాటి కథలు.. మన ఇతిహాసాలు.. సినిమా జీవితం గురించి అతనితో మాట్లాడటం చాలా అద్భుతంగా ఉంది! జై హో! #RRR #TheKashmirFiles #LearningExperience #Blockbusters #JoyOfCinema... అంటూ ఆయన తనలోని ఉల్లాసాన్ని దాచుకోలేకపోయారు. గత వారం అనుపమ్ ఖేర్ నటుడు అనిల్ కపూర్ తో కలిసి రాజమౌళి తెరకెక్కించిన RRRని వీక్షించారు. మల్టీ స్టారర్ గురించి తన రివ్యూ కూడా రాశాడు. "@ssrajamouli #RRR చూసాను. ఎంత అద్భుతమైన వినోదాత్మక చిత్రం. కంటెంట్.. పెర్ఫార్మెన్స్.. పాటలు.. డ్యాన్సులు .. యాక్షన్ సీక్వెన్సులు ఎక్కువగా ఉన్నాయి! @AlwaysRamCharan & @tarak9999 #JrNTR ఇద్దరూ ఎలక్ట్రిఫైయింగ్ పాత్రలతో ఆకట్టుకున్నారు. క్లైమాక్స్ నచ్చింది. మొత్తం టీమ్ కి .. @జయంతిలాల్‌గదా జీకి అభినందనలు! జై హో!'' అని పోస్ట్ చేసారు.
బాలీవుడ్ లో కొందరు ఇంకా బింకం ప్రదర్శించినా కానీ అనుపమ్ జీలో అది ఇసుమంతైనా కనిపించలేదు. చాలా మంది ప్రముఖులు ప్రశంసించినట్టే ఆయన కూడా ఒక సాధారణ ఆడియెన్ లా రివ్యూ ఇచ్చి ఆర్.ఆర్.ఆర్ ని ప్రశంసించారు. రాజమౌళి పనిని ప్రశంసించకుండా అతడు ఉండలేకపోయాడు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ది కాశ్మీర్ ఫైల్స్ లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనంతరం అనుపమ్ ఖేర్ తదుపరి సూరజ్ బర్జాత్యా ఉంఛైలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్- నీనా గుప్తా- బోమన్ ఇరానీ- పరిణీతి చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అన్నట్టు అనుపమ్ జీ పక్కా జెంటిల్మన్ .. ఆయన ఉన్నది ఉన్నట్టు విశ్లేషించారు. అతడిని చూసి సాటి బాలీవుడ్ స్టార్లు నేర్వాల్సినది చాలా ఉంది. ఇది క్రియేటివ్ ప్రపంచం. ఇక్కడ ఎవరి దుకాణం వారిదే. ప్రశంస కురిపిస్తే తప్పేమీ లేదు. పెదవి అంచు నుంచి పాజిటివ్ గా ఒక పదం వినిపిస్తే ముప్పు ఏమీ లేదు. కానీ ఎందుకని దాచేస్తున్నారు? ఖాన్ లు .. కుమార్ లు .. కపూర్ లు .. రోషన్ లదేనా పరిశ్రమ అంటే...!? ఇప్పుడు ఆ వెనకబాటు ఆలోచనకు గుడ్ బాయ్ చెప్పేసే టైమ్ వచ్చేసింది. మరి వింటున్నారా ఈ మాట!!