స్టార్ డైరెక్టర్ శంకర్ తో లైకా సంస్థ వివాదం గురించి తెలిసిందే. మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్! అంటూ ఇరువర్గాల నడుమా ఈగోలు నడుస్తున్నాయని కథనాలొచ్చాయి. ఎవరూ మొండి పట్టు వీడకపోవడంతో భారతీయుడు 2 లాంటి ప్రతిష్ఠాత్మక చిత్రం ఏడాదిగా తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. కోర్టుల పరిధిలో సమస్య పరిష్కారానికి ప్రయత్నించినా కుదరలేదు. ఆ క్రమంలోనే కమల్ హాసన్ మధ్యవర్తిత్వం నెరిపేందుకు ప్రయత్నించారని కథనాలొచ్చాయి.
భారతీయుడు 2కి ఆరంభం నుంచి అన్నీ ఆటంకాలే. శంకర్ ఇండియన్ 2 బడ్జెట్ ను సవరించి అనేక కోట్లకు పెంచిన తర్వాత లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలు విభేదించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సమస్య అంతకంతకు పెద్దదైంది. గత ఏడాది ఫిబ్రవరిలో ముగ్గురు భారతీయుడు 2 సిబ్బంది మరణానికి కారణమైన విషాదకర ఆన్ లొకేషన్ ప్రమాదం తరువాత లాక్డౌన్ ఈ సినిమా చిత్రీకరణకు పెద్ద ఆటంకమైంది. ఆ క్రమంలోనే షూటింగ్ పూర్తిగా నిలిపేసారు. ఇంతలోనే రామ్ చరణ్ సినిమా ని పూర్తి చేయడానికి శంకర్ ఇండియన్ 2 షూట్ ను ఆలస్యం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత లైకా ప్రొడక్షన్స్ దీనికి అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే. కానీ కోర్టులో శంకర్ కి పాజిటివ్ గా తీర్పు దక్కింది. ప్రస్తుతం శంకర్- చరణ్ మూవీ సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సంవత్సరం వేసవి ప్రారంభం నుండి కమల్ ఈ అతిపెద్ద సమస్యను పరిష్కరించడానికి శంకర్ - లైకా మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. తాజా సమాచారం మేరకు... శంకర్ - లైకా మధ్య సమస్యలను కమల్ విజయవంతంగా పరిష్కరించాడని కోలీవుడ్ మీడియా లో కథనాలొస్తున్నాయి. రామ్ చరణ్ తో సెట్స్ పై ఉన్న చిత్రాన్ని పూర్తి చేసిన వెంటనే భారతీయ 2 షూటింగ్ ను తిరిగి ప్రారంభించమని కమల్ శంకర్ ని ఒప్పించారని తెలిసింది. ఒకవేళ ఇదే నిజమైతే కమల్ అభిమానులకు ఇది పెద్ద ఊరట అనే చెప్పాలి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్- సిద్ధార్థ్- రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.