సౌత్ లెజెండ్రీ దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. కోలీవుడ్ లో కార్తీ హీరోగా నటించిన విరుమాన్ సినిమా లో నటిగా అదితి ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హీరోయిన్ గా ఈ సినిమాతో సక్సెస్ అవ్వకుంటే తన వృత్తి అయిన డాక్టర్ ప్రాక్టీస్ ను కంటిన్యూ చేస్తానంటూ చెప్పుకొచ్చిందట.
హీరోయిన్ గా నటించేందుకు తండ్రిని ఎంతగానో చెప్పి ఒప్పించాను అంటూ అదితి చెప్పుకొచ్చింది. తాజాగా విరుమాన్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో దర్శకుడు శంకర్ మాట్లాడుతూ తన కూతురు హీరోయిన్ గా నటించేందుకు మొదట ఒప్పుకోలేదు. కాని సినిమా తో మెప్పించలేక పోతే తప్పకుండా సినిమాలకు దూరం అవుతాను అందని పేర్కొన్నాడు.
విరుమాన్ సినిమా విడుదల అవ్వకుండానే అదితి కి మరో ఆఫర్ తలుపు తట్టిందట. శింబు హీరోగా కరోనా కుమార్ అనే సినిమా రూపొందుతుంది. ఆ సినిమా లో శింబుకు జోడీగా ఈమెను నటింపజేయాలని మేకర్స్ భావించడం.. అదితి కూడా అనధికారికంగా ఓకే అన్నట్లుగానే తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది.
కరోనా కుమార్ క్యాన్సిల్ అవ్వక ముందు నుండే శింబుతో సినిమా విషయంలో అదితి మరియు శంకర్ ల మధ్య కాస్త సీరియస్ గా చర్చ జరుగుతుందట.
శింబుతో సినిమాకు శంకర్ అస్సలు ఒప్పుకోలేదట. మరే హీరోతో అయినా పర్వాలేదు కాని శింబుతో సినిమా చేసేందుకు మాత్రం తాను ఒప్పుకోను అంటూ అదితి తో తెగేసి చెప్పాడు.
అయినా కూడా ఆమె సినిమాను చేస్తానంటూ పత్తం పట్టిందని.. ఇంతలో శంకర్ కోరుకున్నట్లుగా సినిమా ఆగిపోయిందని తమిళ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి శంకర్ మరియు ఆయన కూతురు అదితి మధ్య పెద్ద గొడవ జరగకుండా కరోనా కుమార్ క్యాన్సిల్ అయ్యింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు.