భారతీయ చలన చిత్ర పరిశ్రమలో కొందరు దర్శకులకు ఓ ప్రత్యేకత ఉంది. తాము అనుకున్న అవుట్ పుట్ వచ్చేవరకు సదరు దర్శకులు ఎంత సమయమైనా వేచి ఉండేందుకు సిద్ధపడతారు. క్వాలిటీ విషయంలో రాజీ పడని అటువంటి దర్శకులు...ఏడాదికో....రెండేళ్లకో ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. అయితే, ఆ సినిమా తాలూకు జ్ఞాపకాలు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసేలా చేయడం ఆ దిగ్గజ దర్శకుల ప్రత్యేకత. కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ - బాలీవుడ్ విలక్షణ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ...ఈ కోవలోకే వస్తారు. అయితే, క్వాలిటీ - అవుట్ పుట్ విషయంలో ఏమాత్రం రాజీపడని శంకర్...తాజాగా `2.ఓ`చిత్రం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడట. ఆ చిత్రంలో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తీసేసేందుకు శంకర్ కాంప్రమైజ్ కావాల్సి వచ్చిందని కోలీవుడ్ టాక్.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో శంకర్ తెరకెక్కిస్తోన్న `2.ఓ`చిత్రం ఈ ఏడాది నవంబరు 29న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. వీఎఫ్ ఎక్స్ వర్క్ ఆలస్యం కావడంతో ఆ చిత్రం విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ చిత్రం విడుదల తేదీని ప్రకటించాలని `2.ఓ`ను తెరకెక్కిస్తోన్న నిర్మాణ సంస్థ `లైకా`పై డిస్ట్రిబ్యూటర్లు ఒత్తిడి పెంచారట. దీంతో, తప్పనిసరి పరిస్థితుల్లో విడుదల తేదీని లైకా ఫిక్స్ చేసిందట. అయితే, ఆ చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాల వీఎఫ్ ఎక్స్ వర్క్ పూర్తి కావడానికి చాలా సమయం పట్టేట్లుగా ఉందట. దీంతో, వాటిని తొలగించేందుకు శంకర్ అంగీకరించారట. నిర్దాక్షిణ్యంగా కొన్ని సన్నివేశాలను శంకర్ తొలగించారట. దాని వల్ల సినిమా నిడివి కూడా తగ్గిందట. ఆ రకంగా తొలిసారి శంకర్ క్వాలిటీ, అవుట్ పుట్ విషయంలో కాంప్రమైజ్ కావాల్సి వచ్చిందట. అయితే, ఇప్పటికే విడుదలైన `2.ఓ`ప్రీ విజువలైజేషన్ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో.....`2.ఓ` చిత్రంలో గ్రాఫిక్స్, విజువలైజేషన్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి, తొలగించిన సన్నివేశాల నేపథ్యంలో ఆ అంచనాలను శంకర్ ఎంతవరకు అందుకుంటారో వేచి చూడాలి.