సౌత్ తో దిగ్గజ దర్శకుల పేర్లను తీస్తే అందులో ముందు వరుసలో ముందు ఉండే దర్శకుడు శంకర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ది బెస్ట్ అన్నట్లుగా నిలిచింది. అద్బుతమైన సినిమాలను తెరకెక్కించి - బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు సైతం పోటీగా తన సినిమాలను నిలిపిన ఘనత శంకర్ కే దక్కింది. హాలీవుడ్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఈయన తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘2.ఒ’.
దాదాపుగా 550 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ ప్రతి రోజు కూడా తాను ఎంతో కష్టపడ్డాను అంటూ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. మామూలు సమయంలో చాలా కూల్ గా కనిపించే తాను షూటింగ్ సమయంలో మాత్రం సీరియస్ గా ఉంటాను అంటూ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఒక రోజు షూటింగ్ అంటే ఒకేసారి రెండు పెళ్లిళ్లు విడివిడిగా చేస్తున్నంత హంగామా ఉంటుందని - అలాంటి హంగామాను జాగ్రత్తగా మెయింటెన్ చేయకుంటే మొదటికే మోసం వస్తుందన్నాడు.
ఏదైన బిల్డింగ్ లో నేను షూటింగ్ చేయాలని అనుకుంటే మొదట ఆ బిల్డింగ్ వాచ్ మెన్ ను సంప్రదిస్తాను. అతడు కరెక్ట్ టైంకు వస్తాడా - అతడి వద్ద తాళం ఉంటుందా లేదా అనే విషయాలు తెలుసుకుంటాను. ఒక వేళ అతడు లేట్ అయితే మొత్తం కూడా స్పాయిల్ అయినట్లే కదా అన్నాడు శంకర్. చిన్న విషయంలో కూడా ప్లాన్డ్ గా ఉంటేనే ఇంత పెద్ద సినిమాలను తీయగలం అనేది శంకర్ అభిప్రాయం. షూటింగ్ కోసం కొన్ని వందల మంది వర్క్ చేస్తు ఉంటారు. అలాంటి సమయంలో చిన్న మిస్టేక్ జరిగినా కూడా భారీ నష్టం ఉంటుంది. అందుకే అన్ని విషయాలను నేనే స్వయంగా జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ శంకర్ తన మేకింగ్ విషయాలను వివరించాడు.