మేటి కథానాయిక .. సాగరకన్య శిల్పాశెట్టి అప్పు ఎగ్గొట్టిందా..? ప్రస్తుతం బాలీవుడ్ లో ఆసక్తికర చర్చ ఇది. ఓ ఆసామి శిల్పాశెట్టి - తన సోదరి షమితాశెట్టి - తల్లి గారైన సునంద శెట్టిలపై పోలీస్ కేసు వేయడంతో ఆ వార్త ముంబైని దావానలంలా చుట్టేసింది. శిల్పా శెట్టి తండ్రి సురేంద్ర శెట్టి తమ వద్ద తీసుకున్న రూ.27లక్షలు చెల్లించలేదని కార్ గిఫ్ట్స్ అనే ఆటోమొబైల్ కంపెనీ యజమాని ఫిర్యాదు చేయడంతో జనాల్లో ఆరా మొదలైంది.
ప్రఖ్యాత మిడ్ డే కథనం ప్రకారం.. శిల్పా శెట్టి తండ్రి గారైన సురేంద్ర శెట్టి తీసుకున్న అప్పు చెల్లించలేదని సదరు బాధితుడు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. అయితే శిల్పా శెట్టి తరపున వెర్షన్ వేరొకలా ఉంది. తీసుకున్న రూ.27లక్షల అప్పు ఇది వరకూ మూడు దఫాలుగా చెల్లించేశారు. రూ.8లక్షలు ఓసారి - రూ.5లక్షలు ఇంకోసారి - రూ.8లక్షలు వేరొక ఇన్ స్టాల్ మెంట్ లో చెల్లిచేశారు. కానీ అతడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు అంటూ ఖండిస్తున్నారు.
శిల్పా శెట్టి ఓ ప్రకటనలో మాట్లాడుతూ-``నా తండ్రి గారి ఆర్థిక వ్యవహారాల గురించి నాకు అస్సలు తెలీదు. ఆయన వ్యాపారాల్లో నేను ఏనాడూ ఇన్వాల్వ్ కాలేదు. అయినా తన గురించి నాకు బాగా తెలుసు. అప్పు చెల్లించలేదంటూ సదరు వ్యక్తి మీడియా ముందు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఆయన మా ఫ్యామిలీ కార్ మెకానిక్ లాంటోడు.. దట్సాల్!`` అంటూ కొట్టి పారేశారు. కేసు విచారణలో నిజానిజాలు నిగ్గు తేలాల్సి ఉంటుంది.
Full View