ఆర్ఆర్ఆర్ 'మేకర్స్'కి భారీ షాక్.. బిగ్ లీక్!

Update: 2021-06-25 15:02 GMT
సినీ ఇండస్ట్రీలో కొత్తగా తెరకెక్కుతున్న సినిమాలపై రూమర్స్ అనేవి మాములే. అందులోను పాన్ ఇండియా సినిమా అంటే ఏ రేంజిలో రూమర్స్ క్రియేట్ అవుతాయో చెప్పే అవసరం లేదు. కానీ ఇండస్ట్రీలో సినిమాలకు సంబంధించి రూమర్స్ అంటే మేకర్స్ కూడా కామనే కదా అని లైట్ తీసుకుంటారు. అదే పాన్ ఇండియా సినిమా నుండి లీక్స్ బయటికి వస్తే మాత్రం మేకర్స్ లో టెన్షన్ మాములుగా ఉండదు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి కూడా ఇలాంటి టెన్షన్ రాజమౌళి బృందంలో మొదలైంది.

ఆల్రెడీ ఇదివరకు ఆర్ఆర్ఆర్ షూటింగ్స్ నుండి ఫోటోస్ లీక్ అయ్యాయని తెలిసే సీరియస్ అయినటువంటి మేకర్స్.. ఈసారి ఏకంగా ఓ చైల్డ్ ఆర్టిస్ట్ కారణంగా టెన్షన్ పడే పరిస్థితి నెలకొంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో మెగాహీరో రాంచరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఎన్టీఆర్ రాంచరణ్ లతో పాటు బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవగన్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఇదివరకే రూమర్స్ - లీక్స్ సంబంధించి క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

తాజాగా చక్రి అనే చైల్డ్ ఆర్టిస్ట్.. సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ గురించి ఇన్ఫర్మేషన్ లీక్ చేసినట్లు టాక్ నడుస్తుంది. అదెలా అని అందరూ అనుకుంటుండగా.. ఇదివరకు చక్రి తాను సినిమాలో చిన్నప్పటి ఎన్టీఆర్ క్యారెక్టర్ పోషించినట్లు తెలిపాడట. ఇదిలా ఉండగా.. తాజాగా మరోసారి సినిమాలో అజయ్ దేవగన్ ఎన్టీఆర్ తండ్రిగా నటించాడని బర్త్ డే విషెస్ తో తెలిపినట్లు కథనాలు చెబుతున్నాయి. అంటే సినిమాలో ఇంతకాలం ఎన్టీఆర్ రాంచరణ్ లకి గురువుగా భావించిన అజయ్ దేవగన్ ప్రస్తుతం తండ్రి అనేసరికి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే ఓ యూట్యూబ్ వీడియో విషయంలో కూడా మేకర్స్ రంగంలోకి దిగారు. మరిప్పుడు ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి. ఈ సినిమాను దానయ్య నిర్మిస్తుండగా.. అలియా భట్ - ఓలివియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
Tags:    

Similar News