పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. ఈ నెల 21న జరగనున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ ఉన్నపలంగా క్యాన్సిల్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త పవన్ ఫ్యాన్స్ ని షాక్ కు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే... పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం `భీమ్లా నాయక్` ఈ నెల 25న బారీ స్థాయిలో విడుదల కానున్న విషయం తెలిసిందే. మూడేళ్ల విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్` చిత్రంతో పవన్‌ఖ ప్రేక్షకుల ముందుకొచ్చారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతంగా వున్న సమయంలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది.
మళ్లీ పవన్ తన జోరుని చూపించడంతో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. ఈ మూవీ తరువాత సినిమాల పరంగా స్పీడు పెంచిన పవన్ కల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలని పట్టాలెక్కించారు. వరుసగా మూడు భారీ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన పవన్ కల్యాణ్ ముందుగా `భీమ్లా నాయక్`ని పూర్తి చేశారు. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే తో పాటు రచనా సహకారం అందించిన ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించారు. రానా ,నిత్యామీనన్, సంయుక్త మీనన్ కీలక పాత్రల్లో నటించారు. గత కొన్ని రోజులుగా రిలీజ్ విషయంలో సందిగ్థత నెలకొన్ని ఈ మూవీ రిలీజ్ ఎట్టకేలకు ఫైనల్ అయింది. ముందు అనుకున్నట్టుగానే ఈ మూవీని ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం తాజాగా ప్రకటించి కన్ఫ్యూజన్ కు తెరదించింది.
ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రచార పర్వాన్ని జోరుగా ప్రారంభించిన మేకర్స్ ఈ నెల 21న యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో అత్యంత భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈ వెంట్ ని ప్లాన్ చేశారు. ఇందు కోసం గులాబీ నేత కేటీఆర్ ని ఛీఫ్ గెస్ట్ గా, తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. అయితే తాజాగా ఈ వేడుకని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది. ఏపీ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండె పోటు కారణంగా హఠాత్తుగా మృతిచెందరు. ఆయన మృతితో షాక్ కు గురైన `భీమ్లా నాయక్ ` మేకర్స్ తమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ప్రకటించింది.
అంతే కాకుండా ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా మృతిచెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ఆయన మృతికి పట్ల చింతిస్తూ సోమవారం జరగనున్న `భీమ్లా నాయక్` ప్రీ రిలీజ్ వేడుకని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ జనసేనా పార్టీ అధినేత, హీరో పవన్ కల్యాణ్ మీడియాకు ఓ లేఖని విడుదల చేశారు.
విషాద సమయంలో సినిమా వేడుక చేయడానికి మనస్కరించట్లేదని ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో కీలక బాధ్యతల్లో వున్న శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డిగారు హఠాన్మరణం వల్ల నెలకొన్న ఈ విషాద సమయంలో `భీమ్లా నాయక్` సినిమా వేడుక చేసుకోవడానికి నపా మనసు అంగీకరించడం లేదు. అందుకే నేడు జరగవలసిన `భీమ్లా నాయక్` ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేస్తుంది` అని పవన్ కల్యాణ్ తెలిపినట్టుగా ఓ లేఖని విడుదల చేశారు. అయితే ఈ రోజు రాత్రి విడుదల కానున్న `భీమ్లా నాయక్` ట్రైలర్ విడుదలవుతుందా? లేక పోస్ట్ పోన్ అవుతుందా అన్నది వేచి చూడాల్సిందే.