తేరే ప్యార్ మే- ప్యార్ హోతా కాయీ బార్ హై వంటి చార్ట్ బస్టర్ ల తర్వాత రణబీర్ కపూర్ - శ్రద్ధా కపూర్ నటించిన రొమాంటిక్-కామెడీ చిత్రం `తు ఝూతీ మైన్ మక్కార్` నుంచి `షో మీ ది తుమ్కా..` అనే మరో పెప్పీ ట్రాక్ విడుదలైంది. ఈ పాటను ప్రీతమ్ స్వరపరిచారు. అమితాబ్ భట్టాచార్య రాసిన ఈ ఏడాది తొలి వెడ్డింగ్ సాంగ్ ఇది. రణబీర్ - శ్రద్ద నడుమ ఎగ్జయిట్ చేసే రొమాంటిక్ టింజ్ ఉల్లాసభరితమైన పరిహాసం పాట ఆద్యంతం రక్తి కట్టిస్తోంది. ఈ జోడీ పాట ఆద్యంతం తమ తుమ్కాస్ గేమ్ ను ప్రదర్శించిన తీరు సమ్మోహనంలో ముంచేస్తోంది.
షో మీ తుమ్కా.. పెప్పీ ట్రాక్ ను సునిధి చౌహాన్ - శాశ్వత్ సింగ్ పాడారు. ఈ పాటలో నాయకానాయికలు పెళ్లి వేడుకలో సరదా పరిహాసాలకు తగ్గట్టు స్టెప్పులు అదరగొట్టారు. శ్రద్ధా షిఫాన్ పసుపు చీరలో మతి చెడగొట్టే అందంతో కవ్వించగా.. రణబీర్ మెరిసే నీలం రంగు కుర్తా - పైజామాలో స్మార్ట్ గా కనిపించాడు. కొరియోగ్రఫీ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది.
విజువల్స్ చూడగానే.. యే జవానీ హై దీవానీలోని రణబీర్ పాట డిల్లీ వాలీ గర్ల్ ఫ్రెండ్ ని గుర్తు చేసింది. ఈ పాట రణబీర్ కే చెందిన `బద్దమీజ్ దిల్`ని కూడా గుర్తు చేస్తుంది. ప్రత్యేకించి శ్రద్ధా అతని డ్యాన్స్ మూవ్ లను చూపించాలని సవాల్ విసిరే చోట .. 2013 చిత్రం `యే జవానీ హై దీవానీ` ట్రేడ్ మార్క్ కదలికతో కొరియోగ్రఫీ మురిపించింది. ఇవే కాకుండా కొన్ని ఎగ్జయిటింగ్ తుమ్కాలు - డ్యాన్స్ మూవ్స్ మైమరిపింపజేస్తున్నాయి.
`షో మీ ది తుమ్కా` అనేది ప్యార్ హోతా కయీ బార్ హై- తేరే ప్యార్ మే తర్వాత ఈ చిత్రం నుంచి మూడవ పాట. తు ఝూతి మైన్ మక్కార్ ఈ ఏడాది రణబీర్ కపూర్ కి తొలి రిలీజ్. రణబీర్ - శ్రద్ధ తొలిసారి ఆన్ స్క్రీన్ జంటగా నటిస్తున్నారు. లవ్ రంజన్ దర్శకత్వంలో 2022లో విడుదలైన `బాఘీ 3` తర్వాత శ్రద్ధతో కలిసి తిరిగి అతడు పని చేస్తున్నాడు. ఈ చిత్రంలో డింపుల్ కపాడియా- బోనీ కపూర్- అనుభవ్ సింగ్ బస్సీ-మోనికా చౌదరి-హస్లీన్ కౌర్-రాజేష్ జైస్- అయేషా రజా మిశ్రా తదితరులు నటించారు. మార్చి 8న హోలీ కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View