ప్రభాస్ అసలు సిసలైన డార్లింగ్!!

Update: 2017-12-20 10:58 GMT
టాలీవుడ్ జనాలతో డార్లింగ్ అని ఎప్పుడో పిలిపించుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు బాహుబలి మూవీ కారణంగా తన పరిధి విస్తృతం చేసుకుని.. దేశమంతటికీ ఇష్టుడు అయిపోయాడు. అయినా సరే.. ఓ హీరోయిన్ ఇలా పిలిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.

బాహుబలి సిరీస్ తర్వాత సాహో మూవీలో నటిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. నేషనల్ వైడ్ క్రేజ్ కోసం ఈ చిత్రానికి హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ప్రభాస్ గురించి చెప్పమంటూ శ్రద్ధా కపూర్ ను అడిగారు మీడియా జనాలు. దీనికి అమ్మడు ఇచ్చిన ఆన్సర్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి డార్లింగ్ ప్రభాస్ అని చెప్పింది ఈ బాలీవుడ్ భామ. ఓ హిందీ హీరోయిన్ నుంచి ఇలాంటి రెస్పాన్స్ ఊహించని జనాలు.. షాక్ తినేశారు.

సెట్స్ లోనే కాదు.. వ్యక్తిగతంగా ప్రభాస్ చాలా మంచోడంటూ తెగ పొగిడేసింది శ్రద్ధ. తను కలిసిన మనుషుల్లో అత్యంత మంచి వ్యక్తులలో ప్రభాస్ పేరు కచ్చితంగా ఉంటుందని చెప్పింది ఈ భామ. ఇక వ్యక్తిగతంగా తనకు యాక్టింగ్.. సింగింగ్.. డ్యాన్సింగ్ అన్నీ ఇష్టమేననని.. వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవడం అంటే అసాద్యమని చెప్పింది శ్రద్ధా కపూర్.


Tags:    

Similar News